మకిలి మనసులు;- వసుంధర వెంకట్ నల్ల నుస్తులాపూర్.
 లో లోన కుమిలేటి
 లోకులున్న ఈ లోకంలో!

 లో లోన యున్న మకిలి
 పోగొట్టు మార్గమేది!

 లోలోన మసిలి మసిలి
 కసిరి కసిరి  కసి కసిగా
 కంపు నింపుకున్నట్టి
 మనసుల!

 మకిలి మనుషుల
 మలినంబులన్ పోగొట్టు
 మార్గమేది  !!

 ఊర పూలన్ని దెచ్చియు
 విశ్వమందున్న
 పూజరులనే  పిలిపించి.....

 ఘనమైన పూజలన్నియు
 జేసీ ఒక చిన్న మొక్కను
 నాట.......

నీరింత పోయకున్నను గాని
పెరుగునే ఆ మొక్క పెద్దగానూ.......

 ఎందుకని ఎరుగరో ఈ
 మంద మానసములున్న
 మానవుల్ ......

కామెంట్‌లు