కొలతలు!!!; - ప్రతాప్ కౌటిళ్యా (కె.ప్రతాప్ రెడ్డి)
స్వరాన్ని విరగ్గొడితే
సరిగమలు పలికినట్లు
విత్తనాన్ని సమాధి చేస్తే
అడవి పుట్టినట్లు!!

రక్తం గడ్డ కడితే
గాయం మారినట్లు
మాటల్ని కత్తిరిస్తే
శబ్దాల అద్దాలు పగిలినట్లు!!

మంచినీటినీ కరిగిస్తే
కళ్ళల్లో కత్తుల యుద్ధం చేసినట్లు
కాకులకు గద్దలకు పింధాలు పెడితే
సమస్త యుద్ధాలు గెలిచినట్లు!!!?

జాతకం చెప్పింది పురోహితుడు కాదు
ఆకలి గొన్న రామచిలుక!!!!?

నేలకూలిన మట్టికి మలినమంటదు
నేలరాలిన కిరణం మంట మండదు.

పూల తోటలోని పూలు ఫలాలు కావు
కాయకాసే పూత రాత రాసిన
రైతు దేవుడేం కాదు!!!?

భూమి త్రాగిన నీరుకు
నీరు కరువేం కాదు
లోతుల్లో దాగిన నీరుకు దారి లేదు
ఎత్తుపల్లాలని ఎరిగిన నీరు
హత్య చేయబడుతుంది!!?

దాగిన నిప్పు కప్పుకున్న దుప్పట్లో
అంతా బూడిద అయిపోతుంది
ముక్కలు చేసిన రాళ్లు
ఎక్కడికి ఎగిరిపోవు భూమికి భారం
కాకుండా రెక్కలు కోల్పోతాయి.!!!

దారిమల్లెన గాలులు అదృశ్యమైపోయి
సముద్రం మధ్యలో చిక్కుకుంటాయి.!!

నీవు నిర్మించిన ఓడలు నీటికీ భయపడవు
సముద్రం నిర్మించిన సొర చేపలు దాన్ని నియంత్రిస్తాయి!!!

ఎక్కడికైనా ఎగిరిపో
గాలిని వెంట తీసుకెళ్ళు వెనక్కి తిరిగి వస్తావు!!?

సందేశాలన్నీ
ఆకాశాన్ని దాటిపోతున్నాయి!!
సముద్రం సృష్టించిన సందేశాలు
భూమిని దాటి పోతున్నాయి!!!?

తరతరాల తరంగాల రాతలు
కొలతలు
సరిగ్గా నే పనిచేస్తున్నాయి
ఇంధనం ఇప్పుడు సూర్యుడే!!?

Pratapkoutilya lecturer in Bio-Chem palem nagarkurnool dist 🙏
8309529273.

కామెంట్‌లు