సాత్యకి మహావీరుడు;- కొప్పరపు తాయారు

  భారత కధకు కీలక మైన పాత్ర సాత్యకి ఒకడు.
ఇతడు మహా వీరుడు. అర్జునుడికి శిష్యుడు. అర్జునుడు సాత్యకి ఇద్దరు ద్రోణుడు శిష్యులే. కానీ మొత్తం నేర్చుకున్నదంతా అర్జునుడు  దగ్గరే. అందుకు  అర్జునుడిని గురువుగా భావించేవాడు. అందుకే మహాభారత యుద్ధంలో కూడా పాండవుల వైపున యుద్ధం చేశాడు.
           యాదవ్ వంశానికి సంబంధించిన వాడు. ఒకరోజు మహాభారత యుద్ధంలో ద్రోణాచార్యులు వారు ధర్మరాజుని విపరీతమైన ధోరణిలో అస్త్రప్రయోగం చేయుచున్నప్పుడు. ధర్మరాజు ప్రతిఘటించలేక నిస్సహయస్థితిలో ఉన్నప్పుడు సాత్య కి తన రథంతో వెళ్లి ధర్మరాజు ముందు నిలబడి ద్రోణుడితో యుద్ధం చేయడం మొదలు పెట్టాడు. . ద్రోణుడు ప్రయోగించిన ఆస్ట్రాలన్నిటినీ కూడా ప్రతిఘటించి యుద్ధం ఎంతో బాగా చేశాడు. అప్పుడే కౌరవులందరూ అర్జునుడిని చుట్టముట్టి అస్త్రప్రయోగాలు చేస్తూ ఉంటే సాత్యకి వెళ్లి వారిని ఎదిరించి యుద్ధం చేసి రక్షిస్తాడు
        ‌. చివరికి యుద్ధం నుండి బయట పడతాడు. కానీ గాంధారి శాపం వలన కృతవర్మతో మాటల యుద్ధంలో కోపము పరాకాష్ట నంటుకుని ఒకరి తలలు ఒకరు కత్తితో నరుక్కున్నారు. ఆ విధంగా జరిగింది సాత్యకి మరణం.  భారతంలో పేరు 
గాంచకపోయిన పేరెన్నిక గన్నా విలువిద్యని         ప్రకటించి వీరాధివీరుడుగా సైన్యాన్ని  ప్రతి ఘటించి హతమార్చినవాడు  మంచి విలువిద్యని ప్రకటించిన
  వీరాధి వీరుడు సాత్యకి.
కామెంట్‌లు