ఎందుకు లేదో! మనిషికి మరి;- -గద్వాల సోమన్న ,ఎమ్మిగనూరు.
మండే గుణం అగ్నికి ఉంది
పండే గుణం చెట్టుకు ఉంది
ఎందుకు లేదో! మనిషికి మరి
అండగ నిలిసే మేటి గుణం 

పాడే ఆశ కోకిలకుంది
ఆడే ఆశ  నెమలికి ఉంది
ఎందుకు లేదో! మనిషికి మరి
మేలు చేసే  ఉన్నత ఆశ

వీచే గుణం గాలికి ఉంది
మోసే గుణం గుర్రంకుంది
ఎందుకు లేదో! మనిషికి మరి
ఆదుకునే పవిత్ర గుణం

కురిసే గుణం వానకు ఉంది
విరిసే గుణం పూవుకు ఉంది
ఎందుకు లేదో! మనిషికి మరి
ప్రేమను పంచే మంచి గుణం


కామెంట్‌లు