చిట్టీ!
అప్పటి
వెలుగులేవి
తళుకులేవి
ఉరుకులేవి?
అప్పటి
పువ్వులేవి
నవ్వులేవి
ప్రేమలేవి?
అప్పటి
రూపాలేవి
షోకులేవి
చిందులేవి?
అప్పటి
బొట్టులేవి
జుట్టులేవి
కట్టులేవి?
అప్పటి
లంగాలేవి
ఓణీలేవి
రవికలేవి?
అప్పటి
మోములవెలుగులేవి
నగానట్రాలేవి
గాజులరవాలేవి?
అప్పటి
ప్రాయమేది
పరుగులేవి
పసందులేవి?
అప్పటి
మాటలేవి
మమతలేవి
మనసులేవి?
అప్పటి
పలుకులేవి
ఉలుకులేవి
కులుకులేవి?
అప్పటి
బంధాలేవి
భ్రమలేవి
భావనలేవి?
అప్పటి
స్నేహములేవి
సర్దుబాటులేవి
సహకారాలేవి?
అప్పటి
నడతలేవి
నమ్మకాలేవి
నాణ్యతలేవి?
అప్పటి
మర్యాదలేవి
మమకారాలేవి
మాధుర్యాలేవి?
అప్పటి
చిలుకపలుకులేవి
కోకిలస్వరాలేవి
హంసనడకలేవి?
చిట్టీ!
నువ్వు
అక్కడకుబయలుదేరు
నన్ను
అక్కడకుతీసుకొనివెళ్ళు
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి