వనజ శతకము(అట వెలదులు )-ఎం. వి. ఉమాదేవి
17)
మట్టికన్న బొగ్గు మలినమై యుండును
పసిడిగాల్చి జూపు మిసిమివోలె
తనకులోపమున్న తనవారి వెలిగించు
వనజ మాట మిగుల వాస్తవమ్ము!
18)
మిత్రవర్గమందు మెరమెచ్చు మాటలు
నవ్వియూరకుండు నయముగాను
నమ్మినట్లునుండ నట్టేట ముంచేరు
వనజ మాట మిగుల వాస్తవమ్ము!

19)
చిన్నపెద్దలేక చిత్తములందునన్
పెదసరముగ మాట పేలుచుంద్రు
అట్టివారికెవరు నవసరమ్మున రారు 
వనజమాట మిగుల వాస్తవమ్ము!
20)
ఆవగింజ జూడ నల్పమై కనిపించు 
వేడిపెనుము పైన వెర్రినెగురు
అల్పమైనవాడునట్లు శక్తిని జూపు 
వనజ మాట మిగులవాస్తవమ్ము !

కామెంట్‌లు