వికర్ణుడు;- కొప్పరపు తాయారు

 గాంధారి ధృతరాష్ట్రుల పుత్రుడే వికర్ణుడు దుర్యోధనుడి చిన్న తమ్ముడు. ‌ నూరు మందిలో ఒకడు. చాలా మంచివాడు ధర్మం న్యాయం అని ఆ పద్ధతిలోని నడిచేవాడు. నూరు మందిలో తప్ప పుట్టాడు.. బతికినంత కాలం న్యాయాన్ని ధర్మాన్ని పాటిస్తూ అంతమంది చెడ్డవాళ్లలో కూడా ఉన్నతుడుగా నిలబడ్డాడు
             ధర్మరాజు పాచిక లాటలో సర్వాన్ని కోల్పోయి ఆఖరికి ద్రౌపదిని కూడా ఓడిపోయి నిరాశ  నిష్పృహాలతో ఏమీ చేయలేక ఉన్న సమయంలో. ద్రౌపదిని పట్టుకుని రమ్మంటే ఒకే ఒక వ్యక్తి అంతటి మహాసభలో ఒక వికర్ణుడే, భీష్ముడు దృతరాష్ట్రుడు గురువులు గొప్ప గొప్ప వారంతా ఉండి కూడా వద్దని చెప్పలేక  మౌనం వహించి కూర్చున్నారు. కానీ   చాలా తప్పు కౌరవ వంశానికే ముప్పు అవుతుంది అని చెప్పాడు. అంత ధైర్యంగా చెప్పగలిగింది ఒక్క వికర్ణుడే .తాను నమ్మిన నీతి,ధర్మం, న్యాయం పాటించే వ్యక్తి గా శాశ్వతంగా,చరిత్ర, ఉన్నంత కాలం నిలబడ  గలిగిన వ్యక్తి.  ఒక్క వికర్ణుడు.
                కాకపోతే దుష్టుల సాంగత్యం లో ఉండడం వల్ల కౌరవులు పక్కనే యుద్ధం చేయక
తప్పలేదు . ఆకారణంగా తానూ మరణించక
తప్పలేదు కానీ మాణిక్యం ఎక్కడ ఉన్నా మాణిక్యమే
అని తనను తాను నిరూపించుకుని చరిత్రలో వన్నె
కెక్కిన మహనీయుడు వికర్ణుడు*
కామెంట్‌లు