సార్ధక్యం చేసుకో..... !.కోరాడ నరసింహా రావు.
 శతాబ్దాల జీవనపోరాటాలతో 
సాధించుకున్న విజయాలు... !
పరిపూర్ణత్వాన్ని ప్రసాదించలేకపోయాయా... !?
సృష్టి సమష్టాన్నీ తెలుసుకున్న
 నీ జ్ఞానం, నిన్ను నీకు తెలియ జెయ్య లేకపోయిందా.... ?!
వాదోపవాదాలు.... 
  ఘర్షణలు - సంఘర్షణలు
   జయాపజయాలు... 
 .. బయటనున్న... 
   ఎన్నింటినో చవిచూసిన నీవు
   నీ లోనున్న ఆరుగురే... 
     నీకు ప్రధాన శత్రువులని 
       తెలిసికోలేక పోయావా.. !?
   నేటికి... ఈనాటికి...., 
     సత్యాన్ని సమగ్రంగా... 
       గ్రహించేనాటికి....., 
        ఆ ఆదిమస్థితికే దిగజారిపోయి..., పాస్చాత్తాపంతో... తలమునకలయేవా.... !!
   
ఓ మనిషీ....., 
   ఇప్పటికైనా మించిపోయింది లేదు !
    నీ ఆ జంతుజీవనాన్ని వీడి... 
మానవుడవై, మనుగడ సాగించు... !
నీ సహజ... దయ, జాలి, ప్రేమ, త్యాగం, సేవల  పరిమళాలను ప్రసరింపజేయి... !
     నీమహోన్నత జీవన విధానానికి శ్రీకారం చుట్టు... !
    దుర్లభమైన నీ మానవజన్మను సార్ధక్యం చేసుకో.... !!
        *******

కామెంట్‌లు