తరాలు-అంతరాలు (చిట్టి వ్యాసం);- - డా.గౌరవరాజు సతీష్ కుమార్.

 తరాలమధ్య అంతరాలు అఖాతంలా పెరిగిపోయాయి. తాతలతరంలోని జ్ఞానమంతా
మనుమలతరంలో అజ్ఞానంలా మారింది. పెద్దలుచెప్పిన సద్దిమూటలు నేడు పాచిపోయినవిగా మారాయి. గతంలోని సంస్కృతి, ఆచారాలు, ఆనవాయితీలు,
పండుగలు పబ్బాలు, నోములు వ్రతాలు, ఆహార్యం నేడు అపహాస్యం చేయబడుతున్నాయి. నేటి జ్ఞానులు శాస్రవిజ్ఞానంతో మిడిసిపడి అవాకులూ చవాకులూ పేలుతున్నారు. అప్పుడప్పుడు కొందరు మహానుభావులు పాతతరపు జీవనరీతులు, అలవాట్లు ఇప్పటికీ అనుసరణీయమని చాటుతున్నారు. అయినా, మూర్ఖశిఖామణులు
తమ కుందేటికి మూడేకాళ్ళంటున్నారు. గతంలో తరాలుమారినా అంతరంగం మారలేదు.కాని, నేటితరపు అంతరంగాలు పెద్దల పిన్నల మధ్య అంతరాలు పెంచుతూనేఉన్నాయి. అది పెంపకపు లోపమా?లేక కాలమహిమా???
---------------------------------------------------

కామెంట్‌లు
Unknown చెప్పారు…
👌👌👏👏💐🙏💐 చాలా మంచి
అంశం సర్.ప్రస్తుతం అందరూ ఆలోచించదగినది.చాలాబాగుంది✨
✨లక్ష్మీ సుశీల రాణి పరవస్తు.