న్యాయాలు -141
పిపీలికా పన్నగ న్యాయము
******
పిపీలికా అంటే చీమ. పన్నగము అంటే పాము.
పిపీలికా పన్నగ న్యాయము అంటే చీమలు పెట్టిన పుట్టలను పాములు ఆక్రమించడం అనే అర్థంతో ఉపయోగించే న్యాయము ఇది.
చీమలు ఎంతో కష్టపడి కట్టుకున్న పుట్టలను పాములు ఆక్రమిస్తాయి. అలాగే తాము తినీ తినక కష్టపడి నోరుగట్టుకుని సంపాదించి, కూడబెట్టిన బంగారాన్ని/ ధనాన్ని భూమీశుల అంటే రాజులు (రాజులు బలవంతులు కదా!) వారు చేజిక్కించు కుంటారు.అనేది సామాన్య అర్థం.
దీనినే మరో అర్థంలో చూస్తే లోభి అయిన వ్యక్తి తాను తినీ తినక ఇతరులకు పెట్టకుండా కష్టపడి సంపాదించి దాచి పెట్టిన సొమ్ము లేదా బంగారం చివరికి అయ్యేది రాజుల పాలే. అతనికి ఏ మాత్రం ఉపయోగం లేదు అంటారు. అంటే ఇది కూడా అక్షర సత్యమే కదా!.
అందుకే సుమతీ శతక కర్త ఇలా అంటాడు.
'చీమలు పెట్టిన పుట్టలు పాములకిరవైన యట్లు పామరుడు దగన్/ హేమంబు గూడ బెట్టిన భూమీశుల పాలజేరు భువిలో సుమతీ!'
దీనికి సంబంధించి వేమన కూడా ఇలా అంటాడు .
'ధనము కూడబెట్టి ధర్మంబు సేయక/ తాను తినక లెస్స దాచుగాక/ తేనెటీగ గూర్చి తెరువరికీయదా'
అంటే తాను తినకుండా, ఇతరులకు సహాయం చేయకుండా, దాన ధర్మం చేయకుండా కూడబెట్టిన ధనం చివరికి ఇతరులే అనుభవిస్తారని, అదెలా అంటే తేనెటీగ ఎక్కడెక్కడో ఉన్న పువ్వు పువ్వూ తిరిగి తేనెను సేకరించి తెట్టెలో దాస్తుంది. కానీ ఏం లాభం?చివరికి ఆ తేనెతెట్టెను ఎవరో ఓ బాటసారి ఆ తేనెతెట్టె లోని తేనెను పొందుతాడు.
ఈ పిపీలికా పన్నగ న్యాయములో రెండు కోణాలు ఉన్నాయనేది గ్రహించవచ్చు. ఒకటేమో ఆధిపత్య బలం చేత కష్టజీవి శ్రమ సంపదను దోచుకోవడం, మరొకటి లోభత్వంతో సంపాదించిన డబ్బును ఇతరులు అనుభవించడం అనే అర్థంతో ఈ న్యాయమును ఉదాహరణగా చెప్పుకోవచ్చు.
పంచతంత్ర కథలైన మిత్ర లాభంలో చిన్నయ సూరి గారు కూడా ఇదే అర్థం స్ఫురించేలా "వాయి కట్టి, కడుపు కట్టి, ధనము గడించువాడు పరులకయి మోపు మోయు వాని యట్లు క్లేశమునకు మాత్రము పాత్రము" అంటే "భోగ త్యాగములకు వినియోగింపని ధనము ఉండటం వల్ల ఫలమేమున్నది? లోభి ధనికుడైనా భోగ విరహము చేత దరిద్రునితో సమానుడే" అంటారు.
ఈ మూడు ఉదాహరణల వల్ల"లోభత్వం పనికి రాదనీ,సంపాదించుకున్న సొమ్మును సద్వినియోగం చేసుకోవాలనీ,పాముల్లా ఆధిపత్యపు శ్రమ దోపిడి ఈ సమాజంలో జరుగుతోందని గ్రహించాలి.
ప్రభాత కిరణాల నమస్సులతో 🙏

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి