అభినందనాలిడుచున్నది... ; - కోరాడ నరసింహా రావు!
హొయలొలుకు వగలాడిని 
  కలహంసని పొగుడుదురు !
  పక్షి జాతిలో నిన్నే... 
... హంస రాజమని అందురు !
  ఆకాశంలో  హంసలమై... 
   ఎగిరిపోదమని నవజంటలు 
     కలల నే కను చుందురు...!!
 క్షీర, నీరముల వేరుజేసి... 
..పాలను గ్రహించు... 
.  నీ చతురతను.... 
   నీతి  వాక్యములుగా....
   బోధింతురీ జనులు... ! 
   స్వచ్ఛతకు నీ తెల్లదనము... 
   చెప్పుకోదగ్గది సుమా... !!
      మీ కలహంసల జంట 
    రమణీయమై...  కన్నులపండువ
...........గావించునుగదా !
    అరుదుగా కనిపించే... 
    హంసజాతి మీది...., 
అందుకోండి అభినందనాలిడుచున్నది 
.. మా మానవజాతి.. !!
     *******

కామెంట్‌లు