శక్తి యుక్తి కి హనుమ!- అచ్యుతుని రాజ్యశ్రీ

 పిల్లలు అందరికీ హనుమంతుడు అంటే ఇష్టం.రామాయణం లో మహామాలారత్నం హనుమ.ఆయన శివుని అంశంతో పుట్టాడు.దీనికో కథ ఉంది.గార్ధభ నిశ్వనుడు అనే రాక్షసుడు శివుని గూర్చి తపస్సు చేశాడు.పురుషులచేతిలో చావు లేకుండా వరం పొందాడు.వాడు గర్వంతో అష్టదిక్పాలకుల చేత సేవలు చేయించు కునేవాడు . అప్పుడు విష్ణుమూర్తి జగన్మోహిని రూపంలో వాడిచేత మద్యం తాగించి తాను సింహం గా మారి వాడిని చంపాడు.శివుడు విష్ణుమూర్తి తో"నావల్ల రాక్షసులు వారాలు పొంది పేట్రేగిపోతున్నారు.వారిబాధనించి నీవు కాపాడే నీవే నాకన్నా గొప్ప ‌.నీకు దాసుడిని" అన్నాడు.అప్పుడు విష్ణుమూర్తి "నేను మానవ రూపంలో భూమిపై అవతరిస్తాను.నాకు సాయం చేయి.మనలో మనకి ఎక్కువ తక్కువ లేదు" అని ఒప్పిస్తాడు.అలా రాముని కన్నా ముందే హనుమరూపంలో శివుడు అవతరించాడు.
ఇందులో నీతి ఏమిటంటే అధికార ధనగర్వం పనికిరాదు.మద్యం తాగితే మత్తులో మనిషి రాక్షసుడు గా మారుతాడు.శివ కేశవుల భేదం లేదు.🌺

కామెంట్‌లు