"నామ త్రయా అస్త్ర మంత్రం";- కొప్పరపు తాయారు

 ఇది మూడు మంత్రాలతో ఉన్న అస్త్రం ఈ అస్త్రాన్ని ఒకసారి శ్రీ లలిత త్రిపుర సుందరి దేవి భండాసురుడు తో యుద్ధం చేస్తుంటే వివిధ భయంకర అస్త్రాలు లలిత మాత సైన్యం మీద ప్రయోగిస్తూ వచ్చాడు. భండాసురుడు కానీ అమ్మ అన్నిటినకి. ప్రతిగా  ప్రయోగించి నాశనం చేసింది. అందువల్ల  వాడి యుక్తులు పనిచేయలేదు.
    అప్పుడు భండాసురుడు అమ్మ సైన్యం మీద మహా రోగా అస్త్రాన్ని ప్రయోగించాడు. దానితో సైన్యం రకరకాల రోగాలతో బాధపడుతూ ఉంటే అమ్మ చూసి. ఆ అస్త్రానికి ప్రతిగా మహా మంత్రం అయినా "నామ త్రయ అస్త్ర మంత్రాన్ని" ప్రయోగించి బాణం వేసేసరికి ఆ మహా రోగాస్త్రం నిర్వీర్యం అయిపోయింది. అప్పుడు సైన్యం అంతా కూడా రోగాలన్నీ మాయమైపోయి మామూలుగా తయారై యుద్ధం చేశారు.
    ఇప్పుడు ఎందుకు చెబుతున్నాను అంటే ఈ మంత్రం నిజంగానే జపం సరిగ్గా చేస్తే, మామూలుగా ఎన్నో రోగాలు ఉన్నాయి కదా! ఉదాహరణకి, క్యాన్సర్, పక్షవాతం, అల్సర్, గుండె జబ్బులు మొదలైనవన్నీ కూడా, ఈ మంత్రం జపం చేసి 108 సార్లు రాయడం వల్ల ఆ రోగాలు నుండి విముక్తి పొందిన వారు. ఎంతో, ఎంత మందో ఉన్నారు ఎందుకంటే వ్యాసమహర్షి శ్లోకంలో, ఆయన ఈ మంత్రం గురించి ఏం చెప్పారంటే ఇది గాని జపం చేస్తే తప్పకుండా ఆ రోగాల నుంచి విముక్తి లభిస్తుంది ఇది సత్యం , సత్యమని వ్యాస మహర్షి చెప్పారు.
   ఆ మంత్రాన్ని 108 సార్లు మనం రాస్తే ప్రతిరోజు తప్పకుండా ఏ రోగమైనా సరే, ఏ కష్టమైనా సరే విముక్తి పొందుతాం కచ్చితంగా.
ఆ మంత్రం అచ్యుతానందగోవింద , అచ్యుతాయ నమః,ఆనందాయనమః, గోవిందాయనమః ఇది మంత్రం
కామెంట్‌లు