ఎక్కడికి పోయావో...
ఏమై పోయావో నని...
ఎంత ఆందోళన చెందిందో...
ఆ మాతృ హృదయం... !
బిడ్డను చూచినంతనే...
ఆత్రముగా కౌగలించుకునే వైనం... !!
తల్లి ప్రేమంటే అదే... !
బిడ్డకానరాకపోతే..
తల్లడిల్లిపోదా.....
..యే మాతృ హృదయమైనా !
తప్పిపోయిన బిడ్డ కళ్లె దుటి కొస్తే...
ఆ ఆనందం వర్ణనా తీతమే కదా... !
అది... అనుభవిస్తే గాని అర్ధము కానిది... !!
అందులోని మాధుర్యం తెలియాలంటే...
బిడ్డకు జన్మనిచ్చే తల్లికావలసిందే... !!
మాతృహృదయమే మహోన్నతం... !!
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి