వనజ శతకము(అట వెలదులు ); -ఎం. వి. ఉమాదేవి

 13)
చూడచక్కనైన చోటునయున్నను
మోదమేమి గలదు ముదితలేక
నారి లోకమునకు నక్షత్రకిరణమ్ము 
వనజమాట మిగుల వాస్తవమ్ము!
14)
చదువులెన్నియున్న చక్కని సహనమ్ము
లేనివాడు మిగులలేకి యగును!
ఓర్పు గల్గినపుడు నేర్పుగూడ గలుగు
వనజ మాట మిగులవాస్తవమ్ము !
15)
ఊహలెన్నొ మదిని నూయులనూపును 
కోరికలవి జూడ కొల్లలుండు
నేల విడిచి సామునెపుడును జేయకు 
వనజమాట మిగుల వాస్తవమ్ము!
16)
చిన్నమాట యనిన చీకాకు పడబోకు
కన్నవారినెపుడు కసురు కొనకు
వెన్నవంటి మనసు కన్నవారి దెపుడు
వనజ మాట మిగులవాస్తవమ్ము !
కామెంట్‌లు