నోట్ల రద్దు - జగదీశ్ యామిజాల
 2000 రూపాయల నోటు ఉపసంహరించారని బ్రేకింగ్ న్యూస్. 
కానీ నాకిది ఎందుకూ పనికి రాని బ్రేకింగ్ న్యూస్ ఇది.
రూ. 2000 నోటు వచ్చిన కొత్తలో చూసినట్టు నాకు గుర్తుంది. ఆ నోటింకా చలామణిలో ఉందా? ఉందంటే అది నాకు న్యూసేసుమీ!
నాకసలు అది ఉన్నట్టే తెలీదు. కారణం నాకొచ్చే నెలసరి ఆదాయం నాలుగైదు వేలు దాటదు. నిజం చెప్పాలంటే నాకంటే మా అపార్ట్ మెంట్ వాచ్ మాన్ కే జీతం ఎక్కువ.  
మా ఇంటికి నడక దూరంలో ఓ రెండు ఎటిఎంలు ఉన్నాయి. ఈ రెండు ఎటిఎంలలో ఒకదాంట్లో వంద నోట్లొస్తాయి. మరొక ఎటిఎంలో రెండు వందల నోట్లు వస్తాయి. నేనెప్పుడైనా డ్రా చేయాలంటే ఈ రెండింట్లో ఏదో ఒక దానికే వెళ్తాను. నేను ఒక తడవకి నాలుగు వందలు లేదా ఆరు వందలు డ్రా చేస్తాను. కనుక నేను అయిదు వందల నోటు చూసికూడా కొన్నేళ్ళయ్యింది. వంద నోటు, రెండు వందల నోటు రద్దు చేయనంత వరకూ నాకే బాధా లేదు. రెండు వేల నోటుని నేనెప్పుడో రద్దు చేసుకున్నా నా వాడకంలోంచి. 
పది రుపాయల నోటు
ఇరవై రూపాయల నోటు రద్దు చేస్తేనే కష్టం నా వరకైతే. బహుశా ఈ నోట్లు రద్దు చేయరనే అనుకుంటాను.

కామెంట్‌లు