న్యాయాలు -137
పిపీలికా న్యాయము
*****
పిపీలికము అంటే చీమ. చాలా చిన్న ప్రాణి.కానీ పట్టుదలగా అనుకున్నది సాధించడంలో ఎవరైనా దాని తర్వాతే.
చీమ తాను తినాలనుకున్న పండుకోసం చెట్టు మొదటి నుంచి మెల్లగా చివరి వరకు పాకుతూ వెళుతుంది. అలా పాకి పండుకు కన్నం ( రంధ్రం) చేసి లోపలి రసమును తింటుంది. అలా ఎంతో ఓపిక పట్టి ప్రయత్నించినట్లయితే ఎంతటి పనులైనా సాధింపబడతాయి అనే అర్థంతో ఈ పిపీలికా న్యాయమును ఉదాహరణగా చెబుతుంటారు.
చీమల గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను తెలుసుకుందాం.
చీమలే కదా అని చిన్నచూపు చూడొద్దు. కలిసికట్టుగా, ఐకమత్యంతో జీవించడంలోనూ,విభజించుకుని పనులు చేయడంలోనూ చీమలను మించినవి లేవు. మరో విశేషం ఏమిటంటే చీమలు అసలు నిద్రే పోవట.కంటి నలుసంతున్న చీమల తెలివి తేటలు అంతా ఇంతా కావు. వాటి తెలివి తేటల్లో మానవ మాత్రులకు అంతు చిక్కని జీవన విశేషాలు ఉన్నాయి. వాటిని నిశితంగా పరిశీలిస్తే ఓ పెద్ద గ్రంథమే రాయొచ్చు.
చీమలు కట్టుకునే ఇండ్లు అదేనండీ పుట్టలు వానలు కురిసినా పడిపోనంత బలంగా కట్టుకుంటాయట. ఆ ఇండ్లలో అరలు అరలుగా అనేక గదులు ఉంటాయట. ఒక్కో అవసరానికి ఒక్కో గది ఆహారం దాచుకోవడానికి,పిల్లల పెంపకానికి,మరికొన్ని గదులు విశ్రాంతి తీసుకోవడానికి కట్టుకుంటాయట.ఆ గదులన్నింటినీ కలిపే దారులు కూడా ఉంటాయట.
చీమల ప్రధాన లక్ష్యం ఆహారసేకరణ.అందు కోసం శక్తి వంచన లేకుండా శ్రమిస్తాయట.సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ ఒక నిర్ణీతమైన బాటలో నడుస్తాయి.చీమలకు ఎక్కడైనా ఆహారం కనబడితే తమలోని ఫెరోమోన్ అనే రసాయనాన్ని విడుదల చేస్తాయట.ఆ వాసనను బట్టి మిగతా చీమలు అక్కడికి చేరుకుంటాయన్న మాట.
ఇక చీమలలో రాణి చీమలు, శ్రామిక చీమలు, సైనిక చీమలు, కాపలా చీమలు ఉంటాయి.
రాణికి సేవ చేసే చీమలు శ్రామిక చీమలు. రాణీ చీమ గారి ఆరోగ్యాన్ని గురించి తెలుసుకోవడం, పెట్టిన గుడ్లను లార్వా దశ నుంచి పిల్లలుగా మారి పెద్దయ్యే దాకా కనిపెట్టుకుని ఉండేవి శ్రామిక చీమలు.
చీమలు కట్టుకున్న పుట్టలను కాపాడే పని సైనిక చీమలది. శత్రువులు దాడి చేశారని తెలియగానే కాపలా చీమలు ఒక రకమైన రసాయనాన్ని విడుదల చేస్తాయట.దానిని పసిగట్టిన సైనిక చీమలు ఒక్క పెట్టున శత్రువులపై దాడికి దిగుతాయట.
ఇదండీ పిపిలికము యొక్క గొప్పతనము. నాయకత్వ పోరు లేదు. స్వీయ క్రమశిక్షణ కలదు.ఎవరి పని అవి చేసుకుంటూ బతుకుతాయి.
అందుకే చీమలను చూసి నేర్చుకోవలసిన మంచి విషయాలు, విలువలు చాలా ఉన్నాయి.
ఓ చక్కని పద్యం ద్వారా చీమల గొప్ప తనం గురించి తెలుసుకుందాం.
"చీమ స్వార్థంబు కలిగిన జీవి కాదు/పెక్కు చీమలు గుమిగూడి మెక్కుచుండు/దానికున్నట్టి బుద్ధి యీ మానవులకు/ కలుగదేటికి చిత్రమా కలియుగమున "
అంటే చీమలు నిస్వార్థ జీవులు.ఆహారాన్ని కలిసి పంచుకుని తింటాయి. వాటికున్న బుద్ధి మానవులకు లేదు కదా! అని వాపోయాడు ఓ కవి.
పొట్లపల్లి రామారావు గారు కూడా చీమల గొప్పతనం గురించి "ఓహోహో! చీమలార ఎక్కడికీ మీ పయనం" అనే చక్కని గేయకవిత రాశారు .ఇది ఆరవ తరగతి తెలుగు వాచకంలో 'చీమల బారు' అనే పేరుతో ఉంది.
పిపీలికా న్యాయము ద్వారా పిపిలికము యొక్క జీవన శైలి మరియు శ్రమైక జీవన సౌందర్యం, సహనం, ఓపిక,పట్టుదల వంటి అనేక గొప్ప గుణాల గురించి తెలుసుకునే అవకాశం మనకు కలిగినందుకు ఆనందంగా ఉంది కదండీ!.
ప్రభాత కిరణాల నమస్సులతో 🙏

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి