ప్రేమ గానం ;- వసుంధర వెంకట్ నల్ల నుస్తులాపూర్.
 ఓ దేవి నా దేవి నా ప్రేమ
 సామ్రాఙని శ్రీ మంజు
 భార్గవి
 పాటను వినవమ్మా....
 ఈ ప్రేమ పాటను
 వినవమ్మా....


 వారెవ్వా అరే ఏం పాటని
 తేరగ విని నీవు
 జారిపోకమ్మా.....

 వారెవ్వా అరే ఏం పాటని
 ఆలకించి నీవు
 ఆలోచించమ్మా....నాలో
 ఆశలు రేపమ్మా.....

 ప్రేమకు నేను పేదను
కాను ఆస్తి లేని ఈ
అభాగ్యుడననే అందం
చందం  నాకేం వద్దు నీ
ప్రేమే నాక్కావాలమ్మా....

 అరే చూపు చూపు
 కలిసిందంటే ప్రేమ పెళ్లి
 అవుతుందమ్మ....

 నీవు లేనిదే నేను లేనని
 బావిస్తున్నాను నీవే నాకు
 జీవితమని నే నీ కోసమే
 జీవిస్తున్నాను.....

అరె పేదకు దొరికిన ప్రేమ
 కానుక
 ప్రేమను తాగి పెరగాలమ్మ
 పేదవాడి ఈ ప్రేమను నీవు
 కాదన వద్దమ్మా.......
 నా వేదనవినవమ్మా.....

 మోసం గీసం మొదలే
 లేదు ఆస్తి గీస్తి అసలే వద్దు
 నీ ప్రేమే నాకమృతమమ్మ

 నీ ప్రేమే నాకు పునాది
 అయితే ప్రేమ గోడలే
 పెట్టిస్తాను

 కట్న కానుకలు
 కాల్చేస్తాను

 పెట్టుపోతలను
 నిలిపేస్తాను

 పెళ్లిచూపులను ఆపేస్తాను

 ప్రేమ చూపులకు
 సెలవిస్తాను


 జనంలో జెంటిల్మెన్లా
 చలామనయ్యే నాలాంటి
 వాళ్లు....
జంగల్లో ఒంటరిగా
 నిన్ను చూచి వెంట
 పడతారు జాగ్రత్తమ్మా...
 జాగ్రత్త.... జాగ్రత్తమ్మా..
 జాగ్రత్త.....


కామెంట్‌లు