వేదంలా గోదావరి (చిట్టి వ్యాసం);- - డా.గౌరవరాజు సతీష్ కుమార్.

 ఋగ్యజుస్సామాధర్వణాలు వేదంలో ఉంటే ప్రాణహిత, ఇంద్రావతి, మానేరు, మంజీరలు గోదావరి లో ఉన్నాయి. ఏ పేరయితేనేం? ఏ యేరయితేనేం? అది వేదం. ఇది గోదారి. వేదాన్ని అనుసరిస్తే సకలదేవతలు తృప్తితో ఆశీస్సులందిస్తారు. గోదారిని అనుసరిస్తే సకలప్రాణులు తృప్తితో ఆశీర్వదిస్తారు. వేదాన్ని అపశృతి చేస్తే దేవతలు కోపగిస్తారు.
గోదారిని కలుషితం చేస్తే జీవులకు ప్రాణగండమే. అనంత కాలగమనంలో వేదం గోదారిలాగే ప్రవహించింది. సకలజనావళిని విద్వత్ జ్ఞానంతో తేజోమయంచేసింది. కాలగమనంతో అనుగమించిన గోదారి జనాలకు కూడు, గూడు, గుడ్డలను అందించి
విద్యుత్ జిలుగులతో జీవితాలు సుఖమయం చేసింది. వేదంలా గోదారిని పవిత్రంగా చూసుకోవాలి. వేదంలో ప్రతిఋక్కూ పవిత్రమే. గోదారిలో ప్రతిఒడ్డూ పవిత్రమే.
వేదంలా గోదావరి ఒళ్ళంతా పవిత్రమే!!!
++++++++++++++++++++++++++++++++

కామెంట్‌లు
Unknown చెప్పారు…
ఎంతో అద్భుతమైన అంశం.గోదావరి నదీమతల్లి.
వేదంలా ప్రవహించే గోదావరి.చాలా బాగుంది సర్.చాలాబాగారాశారు.👏🙏💐