అద్భుత చిత్రకారుడు!అచ్యుతుని రాజ్యశ్రీ
 16వశతాబ్దిలో‌పుట్టి నేటికీ సజీవంగా నిలిచిన చిత్రకారుడు ఆయన.ఆచర్చీ అధికారులు అతన్ని ఆజ్ఞాపించారు"నీశిల్పాలు నీ భావాలతో మాకు పనిలేదు.మాచర్చీ పైకప్పు పై వాటర్ కలర్స్ తో మేము కోరిన పెయింటింగ్ వేసి తీరాల్సిందే." "నేను పెయింటర్ని కాదు.శిల్పిని!" ఖచ్చితంగా ఖరాఖండిగా అన్నాడు అతను."మాఆనతి పాటించాలి.లేకుంటే శిక్ష తప్పదు." చర్చీ దే పెత్తనం.సిస్టైన్ ఛాపెల్ అది.పెయింటర్ గా మారటం అతనికి ఇష్టం లేదు.కానీ తప్పదు.ఇన్నాళ్లు చలువరాతి పై చెక్కారు.శిలువపై ఉన్న జీసస్ ని చూసి మేరీ ఏడుస్తున్న 
పియెటా శిల్పం!
ఇప్పుడు చర్చీ పైకప్పు పై 12మంది క్రీస్తు శిష్యులను చిత్రించాలి."అది కష్టం.నాకు నచ్చిన పెయింటింగ్ వేస్తా" అని 5గురు సహాయకులు తో పని మొదలు పెట్టాడు.కానీ వారి పని నచ్చక తాను ఒక్కడే ఆబృహత్ కార్యానికి పూను కున్నాడు.
మంచెలా ఏర్పాటు చేసిన దానిపై పడుకుని పైకప్పు కి రంగు, రంగుల చిత్రాలు వేయడం ఎంత కష్టమైన పని!?
ముందు రంగులకల్పి తన శరీరం పై వేసి చూసుకుంటూ
ఆకలర్స్ షేడ్స్ నచ్చిన తర్వాత చిత్రాలు గీశాడు."ఇంకెప్పుడు పూర్తి చేస్తాను?" అని చర్చీవారు చెవిలో జోరీగ లాగా సతాయించేవారు.తిండి తిప్పలు పక్కన పెట్టి3ఏళ్లలో అది పూర్తి చేశారు.1నవంబర్1512లో అది పూర్తి ఐంది.1534లో లాస్ట్ జడ్జ్ మెంట్ తో ప్రపంచ చరిత్రలో చిరస్థాయిగా నిలిచి పోయిన ఆకళాకారుడి కిదే వందనాలు

కామెంట్‌లు