జంట పదాల జావళీలు; - శిరందాస్ శ్రీనివాస్- నిజాం వైద్య విజ్ఞాన సంస్థ
తళ తళ మెరిసే దుస్తులు
మిల మీల మెరిసే మెరుపులు
కల కల లాడే పంటలు
కిల కిల పాడే పక్షులు
మల మల మాడ్చే ఎండలు
గల గల పారే నదులు
గుస గుస లాడే జంటలు
గుల గుల పెట్టే నవ్వులు
గిల గిల కొట్టుకునే చేపలు
విల విల లాడే మనసు
ఫెల ఫెల ఇరిగే కొమ్మలు
జల జల జారే సెలయేర్లు
సల సల కాగే నీళ్ళు

గజ గజ వణికే పిల్లలు
దబ దబ నడిచే అడుగులు
ధన ధన నడిచే అబలలు
గణ గణ మ్రోగే గంటలు
పర పర నమిలే దంతాలు
సుర సుర మని కాలే పాదాలు
మిస మిస లాడే  అందాలు
కస కస నమిలే చూపులు
పిట పిట లాడే వయసు
మస మస లాడే కడుపు
పుస పుస మని జారే బురద
పస పస తొక్కే పేడ 
గుస గుస లాడే సొగసులు
రుస రుస లాడే కోపాలు 
బుస బుస మనే తాపాలు
కిస కిస నవ్వే నవ్వులు
సిమ సిమ మనే మంటలు
చిమ చిమ లాడే వయసు
ఘుమ ఘుమ లాడే వంటకాలు
పక పక నవ్వే పడుచులు
టక టక చెప్పే జవాబులు
తట తట కొట్టే తలుపులు
సుల్కు సుల్కు మనే పొడుపులు.
చక చక చేసుకునే పనులు

ఇదేరా మన తెలుగు సొగసులు
ఈ సొగసు ఏ భాషలో చూసేవు.
అందమైన ఆంధ్రమ్ము పలుక
నీ సొగసు మరచి పోయేవు..



కామెంట్‌లు