" చెట్టు @...! "-- కోరాడ నరసింహా రావు !
కడుపుకింత కూడు దొరకాలంటే... పంటలు పండాలి గా.. !
  పంటలు పండాలంటే... వానలు కురవాలిగా... !
   వానలు కురవాలంటే... నేలపై పచ్చదనం పుష్కలంగా ఉండాలిగా... !
    అడవులన్నీ అంతరించిపోతుంటే... ఇంక పచ్చదనమెక్కడ... !?
    వర్షాలెక్కడ... ?! పంటలెక్కడ.. !? తిండే కాదు గుక్కెడు నీటికీ ఇక్కట్లు తప్పవు కదా... !!
     తిండీ, నీరే కాదు......, 
మన ఊపిరులు నిలవటానికి 
ఒక్క శ్వాసకోసం అల్లాడిపోయే 
రోజులూ రాకతప్పవు.... !
      ఓ మనిషీ... !
  విరివిగా మొక్కలను నాటి... 
   ఈ ఉపద్రవం నుండి బయట పడు.... !!
      లేకుంటే....., కడుపుకింత కూడు, గుక్కెడు నీళ్లు... దొరకక 
ఊపిరాడక ప్రాణాలు విడుస్తావ్ 
      చెట్టే... నీరు !
  చెట్టే.... తిండి... !!
 .. చెట్టే.... ప్రాణం.. !!!
   జాగో... మానవా.... జాగో.. !
        ******

కామెంట్‌లు