అందరూ హాయిగా నవ్వుకుంటారు .అది ఒక ఆరోగ్యం కొంతమంది నవ్వించడానికి పుడతారు. అది వారి అదృష్టం. సుబ్బారావు గారు ఎక్కువ మాట్లాడరు. కానీ ఏదైనా అవకాశం వస్తే హాస్యవల్లరే.
ఎప్పుడు ఇంట్లో ఏదో ఒక సభ అంటే చదువుల గురించి, సాహిత్యం గురించి, లేక దేశ కాల మాన పరిస్థితుల్లో, ఒక్క విషయం వదిలేవారు కాదు.
ఎవరో కవిత్వం చెప్పమని అడిగితే ఈయనలేచి "ఏమి చెప్పను ఏమి చెప్పను"
"నగరంలో నిటారుగా నిలబడ్డ ఇల్లు గురించి" పొరపాటున ఒకరి ఇంట్లో ట్యూబు పనిచేయకపోతే నల్లాలన్నీ కరాబ్ ఇంట్లోకి వస్తుందండి సుగందాల వెల్లువలు.
అప్పుడు పెద్ద బకెట్ పట్టుకొని అపవిత్ర అశుభ్ర నీరుని శుభ్రపరచుకున్న తరణం దివ్యం, అనంతం, అంటూ లేచాడు" బాబు ఊరుకుంటారా" ఎప్పుడు కంపుల గొడవేనా అని కసురుకున్నారు భార్యామణి.
ఇంతలో అత్తగారు వచ్చి నాన్న కూరగాయలు లేవురా బజార్ కెళ్ళి తెచ్చి పెట్టండి.అనగానే వెళదామురండి, కొనే అరా, పావు కిలో కూరగాయలకు, స్కూటర్ పెట్రోలు దండగ.
తీరా వెళితే కిలో 100, 200, రూపాయలు చెబితే తినేది ఏముంది? గడ్డే కదా అది కూడా దొరుకుతుందో లేదో!
" అబ్బా! "నాన్నగారు ఆపండి మీ అల్లరి కవిత" ఇందులో తప్పేముంది నాన్న ఉన్న నిజమే కదా! ఏమైనా తినక తప్పదు కదా నాన్న"!
అని కూరగాయలకు వెళ్ళాడు. అంతలో
సుబ్బారావు గారి స్నేహితుడు శ్రీను వచ్చాడు "ఏరా సుబ్బు నీ రేడియో బాగుందా ఈరోజు" అన్నాడు.
వెంటనే సుబ్బారావు గారు "ఆల్ ఇండియా రేడియోకి టైమింగ్స్ ఉన్నాయి" "కానీ ఈ రేడియోకి రాత్రి పగలు ఉండదురా, వినేవాడు ఉండాలి అంతే అన్నాడు"
" అయితే నేను దొరికానన్నమాట, నీకు ఈరోజు నేను నీకు బలి అంతే కదా"!
" అంత మాట వద్దు రా! నేనేమి అమ్మ వారిని కాను, నిన్ను బలి తీసుకోవడానికి అన్నాడు సుబ్బు"
" వెంటనే చాకలి సింగన్న వచ్చి బట్టలు వేస్తారా అండి" అని అడిగాడు.
" వెంటనే ఈయన అందరూ ఉండగా నన్ను ఎలాగా బట్టలు ఇప్పమంటావ్ సింగన్న సిగ్గు సిగ్గు అన్నారు". అందరూ నవ్వేశారు. పాపం సింగన్న విల,విల లాడుతూ మిమ్మల్ని కాదండి, అమ్మగారిని అన్నాడు.
"వెంటనే చెట్టంత మనిషిని ఆమె భర్తని నేనుండగా, నా ముందు ఆమెని బట్టలు ఇప్పమంటావా అని, అరిచేసరికి ,అందరూ నవ్వారు కానీ అమాయకుడు సింగన్న కళ్ళు నీళ్లు పెట్టుకొని ఏందయ్యా గారు, ఇలాంటి తమాషా మాటలు నాకు సేతకావండి, నేను అలా అంటానా? మీకు న్యాయమేనా! అన్నాడు వెంటనే అతనిని లలితమ్మ, సింగన్నా, నువ్వు బాధపడకు ఆయన అదంతా తమాషాగా మాట్లాడతారు, నవ్వేసి ఆనందించాలి గాని నిజం అనుకోని బాధపడకు తెలిసిందా అంటే, తెలిసిందమ్మ గారు అన్నాడు.
ఇంతలోకి పెళ్లిళ్ల పేరయ్య గారు వచ్చారు. నమస్కారం రండి రండి అని ఆహ్వానించారు... పేరయ్య గారు నమస్కారం ,సుబ్బారావు గారు అని అన్నారు. వెంటనే అదేంటండీ మీ .నమసు మింగేసి నాకు కారం పెడతారా అన్నారు..
పాపం ఆశ్చర్యపోయాడు ఇంతలో ఉండండి మీరు.. అని అడ్డుకట్ట వేసిన లలిత గారు కూర్చోండి మంచి తీర్థం తెస్తాను అని లోపలికి వెళ్లారు.
"ఎలా ఉన్నారు సార్" అన్నారు పేరయ్యగారు.
" ఎవరు అన్నారు "?
"అదేనండి మీ ఆరోగ్యం"
"అదేంటండి నా ఆరోగ్యానికి ఏం వచ్చింది" అన్నారు సుబ్బారావు గారు.
"అది కాదండి". "ఏంటండీ కాదు, మీరు అడిగారా ఎలా ఉందని, నాకేమైంది మీకు ఎవరు ఏం చెప్పారు చెప్తే కదా! నేను మాట్లాడడానికి అన్నారు.. ఈ తమాషా చెలగాటానికి బలి అవుతున్న పంతులు గారిని, లలితమ్మగారు నీళ్లు ఇచ్చి కాపాడారు..
అమ్మ సంబంధాలు తెచ్చాను చూడండి మీకు నచ్చితే .... అనే లోపల సుబ్బారావు గారు, "అదేంటండి నేను ఉండగానే మా ఆవిడకి సంబంధం దేనికండి" అన్నారు "బాబోయ్ మీకు ఒక దండం". మీ లలితమ్మకు కాదండి! మీ అమ్మాయి గారికి అన్నారు..
"అదే మిమ్మల్ని అడిగిందా"
"అదేంటండీ అడగడం ఏంటి"?
" మిమ్మల్ని అడక్కుండా ఎలా తెస్తారు ఇవేం బజారుల వస్తువుల"?
"అయ్యా! "క్షమించండి నేను వెళ్తాను అన్నాడు" పంతులుగారు..
"పరవాలేదు కూర్చొని మాట్లాడండి", నేను వస్తానని జారుకున్నారు సుబ్బారావు గారు.
తమాషా చేసే వారిని మనం తప్పు పట్టకుండా వారితో పాటు మనం కూడా కాసేపు నవ్వితే ప్రస్తుత పరిస్థితుల్లో కాస్త హాయ్ ని ఆస్వాదించొచ్చు. అందుకే నవ్వండి, నవ్వించండి, నవ్వుతూ బతకండి, అనేదే సుబ్బారావు గారి "నవ్వుల పువ్వుల హృదయం" కోరుతుంది
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి