న్యాయాలు -140
పిష్ట ప్రమిత్య వూప న్యాయము
*****
పిష్టము అంటే పిండి.ప్రమిత అంటే కొలవబడిన, పరిమిత, కొన్ని, కొద్దిగా అనే అర్థాలు ఉన్నాయి.అపూపము అంటే పిండివంట,కజ్జ,అప్పచ్చి,పప్ప, అట్టు, రొట్టె,దోశ అనే అర్థాలు ఉన్నాయి.
పిష్ట ప్రమిత్య పూపము అంటే పిండి కొద్దీ రొట్టె అని అర్థం.
దీనికే తెలుగులో పిండి కొద్దీ రొట్టె,విత్తము కొద్దీ విభవము/వైభవము అనే సామెతలు ఉన్నాయి.
పిండి కొద్దీ రొట్టె అంటే మన దగ్గర ఉన్న పిండిని బట్టి రొట్టె పెద్దదో చిన్నదో చేయడం అవుతుంది. కొంచెం పిండితో పెద్ద రొట్టె కావాలనుకోవడం, చేయాలనుకోవడం సాధ్యం కాని పని కదా!.
దీనినే మానవ జీవితానికి వర్తింప చేసి చెప్పారు మన పెద్దలు.
పిండిది ఏముంది? మరికొంత తెచ్చి కలిపి చేస్తే ఎన్నంటే అన్ని రొట్టెలు చేసుకోవచ్చు.కానీ డబ్బు విషయంలో మాత్రం అలా చేయకూడదని అంటారు. తాహతుకు మించి అప్పో సప్పో చేస్తే అవి తీర్చలేక జీవితాంతం బాధ పడాల్సి వస్తుందనే అర్థంతో ఈ న్యాయమును ఉదాహరణగా చెప్పారు.
దీనినే 'విత్తం కొద్దీ విభవము అని కూడా అంటారు. విత్తము అంటే డబ్బు, ధనము, సొమ్ము.అది ఉన్నప్పుడు నచ్చిన విధంగా ఎంతో వైభవంగా,విలాసంగా బతకొచ్చు.
దీనికి మరో సరదా సామెత కూడా ఉందండోయ్! 'జుట్టున్నమ్మ ఏ కొప్పైనా వేసుకోగలదు'.అని.
మరి లేని వారి పరిస్థితి.ఉన్న జుట్టుతో సర్దుకు పోవడమే కదా చేయగలిగేది. సవరము లాంటివి ఉపయోగించొచ్చు కదా ! అంటారేమో. ఎంతైనా పుట్టుడు జుట్టుకు,పెట్టుడు జుట్టుకు తేడా ఉంటుంది కదండీ!.
అందుకే మరి విత్తము/ సొమ్ము లేని వారు తమ తాహతును మరిచి పోవద్దనీ.తమ స్థాయిని గుర్తెరిగి జీవించాలనే సందేశం ఇందులో ఇమిడి ఉందని గ్రహించాలి.
దీనికి దగ్గరగా మరో ఉదాహరణను కూడా చెప్పుకుందాం.
రామాయణంలో సీతమ్మ జాడ తెలుసుకోవడానికి ఎందరో వానర వీరులు సముద్ర తీరంలో సమావేశం అవుతారు.జాటాయువు సోదరుడైన సంపాతి ద్వారా సీతమ్మ లంకలో ఉందని తెలుసుకుంటారు.లంకకు వెళ్ళాలంటే మహా సముద్రం దాటాలి. ఎందరో కపి వీరులు ఉన్నారు.కానీ ఎవరెవరి శక్తి సామర్థ్యాలు ఎంతటివో వారికి తెలుసు.అందుకు హనుమంతుడే సరైన వాడు,సముద్రాన్ని లంఘించి వెళ్ళగల సమర్థుడని,అతనికా శక్తి సామర్థ్యాలు ఉన్నాయని గ్రహించి హనుమంతుడినే అందుకు నియమిస్తారు.
అలాగే లంకకు వారధి కట్టడానికి నీలుడిని నియమిస్తారు.ఇలా ఒక్కొక్కరి సామర్థ్యాన్ని బట్టి పనులు కేటాయించడం జరిగింది.
అంటే ఆర్థిక, శారీరక,మానసిక స్థితిని, సాధ్యాసాధ్యాలను అంచనా వేసుకుని వాటికి అనుగుణంగా జీవితాన్ని మలుచుకోవడం మంచిది.అది బుద్ధిమంతుల,విజ్ఞుల లక్షణం.
అంతే కానీ లేనిపోని భేషజాలకు,ఆడంబరాలకు పోయి బతుకును ఆగము చేసుకోవద్దని, ఉన్న దాంట్లో సర్దుకు పోయి ప్రశాంతంగా జీవితాన్ని గడపమని చెబుతున్న 'ఈ పిష్ట ప్రమిత్య వూప న్యాయము' యొక్క అంతరార్థాన్ని తెలుసుకుని మసలుకోవాలి.
ప్రభాత కిరణాల నమస్సులతో 🙏

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి