సుప్రభాత కవిత ; -బృంద
మన మనసు కోరేది
మన అదృష్టం లో ఉండదు
రెండూ మనవే అయినా  ఎందుకో?

పిర్యాదులెన్ని ఉన్నా
ఒకమాట కూడా అనని
సహనం దేనికో

అసంతృప్తులే
అన్నీ అయితే
ఆశించడం దేనికో!

మాయని తలపుల
గాయం మాన్పని
మాటలెందుకో!

కనిపించని మంటలను 
ఆర్పే నీరు అసలెక్కడా
ఉండదు ఎందుకో?

సులభంగా దొరికేది
విలువైనదైనా
అలుసే ఎందుకో?

ఆనందంగా అగుపడడానికి
అంతరంగంతో
అలుపెరగని యుధ్ధం ఎందుకో?

గెలవాలని అందరూ
ప్రయత్నిస్తారు
గెలుపు మాత్రం అదృష్టం
నిర్ణయిస్తుంది  ఎందుకో?

కోటికలతలున్నా 
ఉదయం  తెచ్చే ఉత్సాహం 
మదిని ఊయల
ఊపేస్తుంది అదేమిటో!

🌸🌸 సుప్రభాతం 🌸🌸


కామెంట్‌లు