అందరికోసం! అచ్యుతుని రాజ్యశ్రీ

 "నాన్నా!పంటలు మునిగాయి. సర్కారు సాయం అందడంలేదు.ఏం చేద్దాము?"శివా ప్రశ్నకి మంచంలో ఉన్న వృద్ధుడు సాలోచనగా చూశాడు."శివా!మనమూల గదిలో  వెతుకు.ధాన్యం బస్తా కన్పిస్తుంది ఏమో ?"శివా ఆచీకటి కొట్టం లోకి వెళ్లాడు.అందులో అనవసరపాతసామాన్లు పడేశారు. తాత ముత్తాతల కాలంనాటి సామానులున్నాయి.ఆమూలబస్తానిండా వడ్లుకనిపించేప్పటికి ప్రాణం లేచివచ్చింది.తిండి కి మాడనవసరంలేదు అని సంతోషం తో తండ్రి కి ఆవిషయం చెప్పాడు."శివా! అవి మేలురకపు విత్తనాలు! ఏరువాక తొలకరిలో ఆవరివంగడాలు నాటితే మనందరి చేలలో బంగారం పండుతుంది. ఇప్పుడు దొరికేవన్నీ నాసిరకం విత్తులే కదా?మన తోటిరైతులకు పంచుదాం.ఇప్పుడు ఆకలిబాధకు తట్టుకోలేక మనంతింటే ఎలా?" అలా శివా వెడల్పు పంచాడు
అవి మొలకదశలో ఉన్నప్పుడు తండ్రి చనిపోయాడు. కానీ పైరులు బాగా ఎదిగి ప్రతిరైతు పొలం వరికంకులతో కళకళలాడుతూ ఉంటే శివా తండ్రి రామయ్య మొహం అందులో  కన్పడుతోంది 🌹.
కామెంట్‌లు