మట్టిదేవత (చిట్టి వ్యాసం);- డా.గౌరవరాజు సతీష్ కుమార్.

 ఛీ ఛీ ఛీ ఇది ఏం మట్టి? ఛీ నాకు అంటుకుంది దరిద్రంమట్టి. నేను ఏడంతస్తుల మేడమీదుంటా. పట్టు తివాచీల మీద నడుస్తా. చీనిచీనాంబరాలు ధరిస్తా. వజ్ర వైఢూర్యాల నిధిని సంపాదిస్తున్నా. అవును, దరిద్రంమట్టి నాకెందుకూ? అనుకున్నాను ఇన్నాళ్ళు. కాని, ఇదేం విడ్డూరమో… నా మేనును గీరితే మట్టివస్తోంది. మేడను కడితే మట్టే కావాలి. నేను నడిచేది భూమి పైనే. నిధి లభించేది మట్టిలోనుండే. బురదలోనుండే బువ్వపుడుతోంది. గాలినిచ్చే చెట్లు మొలిచేది భూమిపైనే. ఆకాశం నుండి కురిసే వర్షం
ఇంకిపోయేది భూమిలోకే. అసలు నేను మనుగడ సాగించేది ఈ మట్టిపైనే. అంతేనా? నేను తుదకు కలిసిపోయేది ఈ మట్టిలోనే. ఈనిజం తెలుసుకున్నా. అందుకే మట్టి దేవతకు మొక్కుతున్నా!!!
++++++++++++++++++++++++++++++++++

కామెంట్‌లు