పండుగలే జాతి జీవనాడులు (చిట్టి వ్యాసం);- :- డా. గౌరవరాజు సతీష్ కుమార్.

 పండుగలు మన జాతి జీవనాడులు. పండుగలు మన సాంప్రదాయాలు. పండుగలు మన సంస్కృతీ పతాకలు. తరతమభేదాల స్వస్తివాచకాలు. సకలదేవతల ప్రాపకాలు. సకలజనుల భావనల పూరకాలు. సబ్బండవర్ణాల మేళవింపు. సకల కోరికల నివేదింపు.
శాంతి సమభావనల చిత్తగింపు. ఇంపైన భోజనాల ఆరగింపు. ఆనందోత్సాహాల కలబోత.
పెద్దల దీవెనల కుండపోత. ప్రతిపండుగ ఆదేశం భరతజాతి ఆరక్షణ. ప్రతిపండుగ సందేశం పంచభూత సంరక్షణ. ప్రతిపండుగ ఉపదేశం మానవత్వ పరిరక్షణ!!!
+++++++++++++++++++++++++

కామెంట్‌లు