జాతీయ విద్యా విధానం 2020; -సి.హెచ్.సాయిప్రతాప్
 కేంద్ర క్యాబినెట్ 2020  సంవత్సరంలో  ఉన్నత విద్యలో సంస్కరణలు అమలు చేస్తూ 'నూతన విద్యా విధానం-2020'కి ఆమోదం తెలిపింది.
దీంతో పాటు కేంద్ర మానవ వనరుల మంత్రిత్వ శాఖ పేరును కేంద్ర విద్యా శాఖగా మార్చారు. ఈ మార్పులను సూచించిన కమిటీకి మాజీ ఇస్రో చీఫ్ కె కస్తూరి రంగన్ నేతృత్వం వహించారు. ఈ నూతన జాతీయ విద్యా విధానం అమలులోకి వస్తే విద్యార్ధులకు ఒత్తిడి లేని చదువులు సాధ్యం అవుతుంది.
కొత్త విధానం పాఠశాల, ఉన్నత విద్యా రంగంలో పెద్ద ఎత్తున సంస్కరణలకు బాటలు వేయనుంది. అందరికీ సమాన విద్యా అవకాశాలు, అందుబాటులో విద్య, త్రిభాషా సూత్రం అమలు, మాతృభాషలో సాంకేతిక విద్యాబోధన లాంటి విప్లవాత్మక మార్పులు రాబోతున్నాయి.  
ఇందులో ముఖ్యమైన అంశం నూతన పరీక్షా విధానం. అయిదవ తరగతి వరకు మాతృ భాషలోనే పాఠాలు నేర్పిస్తారు. బోర్డు పరీక్షలు విద్యార్థి సముపార్జించిన జ్ఞానాన్ని పరీక్షించే విధగా తీర్చి దిద్ది, మూస తరహా పరీక్షలకు స్వస్తి చెబుతారు. పిల్లల రిపోర్ట్ కార్డులలో కేవలం వివిధ సబ్జెక్టులలో వచ్చిన మార్కులు మాత్రమే కాకుండా వారి ఇతర నైపుణ్యాలకు కూడా మార్కులు ఇస్తారు. విద్యార్ధులకు తమకు నచ్చిన కోర్సులో చేరే లేక తమకు నచ్చిన సబ్జెక్టులను ఎంచుకునే స్వేచ్చ ఇప్పుడు లభిస్తుంది.

విద్యా విధానాన్ని ఇప్పుడున్న 10 + 2 నుంచి 5+3+3+4 గా విభజిస్తారు. మొదటి అయిదు సంవత్సరాలలో ప్రీ ప్రైమరీ నుంచి రెండవ తరగతి వరకు ఉంటాయి. రెండవ దశలో మూడు నుంచి అయిదవ తరగతి, తర్వాత దశలో ఆరు నుంచి ఎనిమిదవ తరగతులు, చివరి నాలుగు సంవత్సరాలలో తొమ్మిది నుంచి 12 వ తరగతి వరకు ఉంటాయి.స్థానిక భాష, ప్రాంతీయ భాషను బోధనా మాధ్యమంగా కనీసం 5వ తరగతి వరకు ఉంచాలని, 8వ తరగతి ఆ పై వరకు దీన్ని కొనసాగించవచ్చని కొత్త విద్యా విధానం చెబుతోంది. సంస్కృతంతోపాటు భారతదేశంలోని ఇతర ప్రాచీన భాషలు, సాహిత్యం కూడా విద్యార్థులు ఆప్షనల్సబ్జెక్టుగా ఎంచుకునే వీలు కల్పించింది.

కామెంట్‌లు
Popular posts
తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు--ఎం బిందుమాధవి
చిత్రం
రామాయణం‌ నుండి108 ప్రశ్నలు –జవాబులు!:----సుజాత.పి.వి.ఎల్.
చిత్రం
వినదగు నెవ్వరు చెప్పిన: --ఎం బిందుమాధవి
చిత్రం
పూర్వ విద్యార్థుల సమ్మేళనం అపురూపం::-యాడవరo చంద్రకాంత్ గౌడ్ తెలుగు పండిట్- సిద్దిపేట-9441762105
చిత్రం
కులవృత్తులు మరువకురా గువ్వలచెన్న వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండల్ గొటిక ఖుర్డు ప్రాథమిక పాఠశాలలో కుల వృత్తుల పై విద్యార్థులు వినూత్న ప్రదర్శన విద్యార్థుల వినూత్న ప్రదర్శన అభినందించిన బషీరాబాద్ వైస్ ఎంపీపీ జడల అన్నపూర్ణ వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండలం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల గోటిక ఖుర్దు స్కూల్లో గ్రామంలో ని కుల వృత్తులు పై విద్యార్థులు పాఠశాలల్లో వినూత్న ప్రదర్శన నిర్వహించారు నేటి సమాజంలో ప్రపంచీకరణ , ఆధునికత పేరుతో కులవృత్తులకు ఆదరణ కరువు అయినవీ పల్లె నుండి పట్నంకు బతుకుదెరువు కోసం కన్నతల్లిని ఉన్న ఊరిని వదిలి కుల వృత్తిని వదిలి పట్నంలో వెళ్లి కూలీ గా పనిచేస్తున్నారు కావున ఆనాటి నుండి నేటి వరకు గ్రామంలో అనేక కుల వృత్తుల ప్రాధాన్యత ఉంది సమాజంలో కుమ్మరి కమ్మరి మేతరి చాకలి . వడ్రంగి. రైతులు .పోస్ట్ మాన్ కురువ. లాయర్. డాక్టరు మొదలైన వృత్తుల ప్రతిబింబించే విధంగా కళ్లకు కట్టిన విధంగా పాఠశాల ఆవరణంలో విద్యార్థులు చక్కగా ప్రదర్శించారు పాఠశాల ప్రధానోపాధ్యాయులు మురళి హరినాథ్ విద్యార్థుల చేత 26 వేషధారణ వేసి విద్యార్థుల నైపుణ్యాన్ని వెలికి తీయడం కోసం మరుగునపడిన కులవృత్తులను గుర్తు చేసుకోవడం కోసం చక్క గా ప్రదర్శించడం జరిగింది విద్యార్థులలో చిన్నప్పటినుండి అన్ని అంశాలపై అవగాహన కలిగినట్లయితే భవిష్యత్తులో వారికి నిత్య జీవితంలో ఎంతో ఉపయోగపడుతుంది ప్రభుత్వ పాఠశాలలు మరింత బలోపేతం చేయడం కోసం విద్యార్థులను సర్వతోముఖాభివృద్ధి చేయడం కోసం కృషి చేస్తున్నానని ప్రధానోపాధ్యాయుడు మురళి హరినాథ్ చెప్పారు విద్యార్థులకు ఒత్తిడి లేకుండా జాయ్ full learning నేర్పించాలని సంకల్పించడం జరిగిందని అన్నారు ఈ కార్యక్రమంలో లో గ్రామ పెద్దలు శ్రీనివాస్ రెడ్డి ఉపాధ్యాయులు జయ శ్రీ .నవనీత. విటల్ గౌడ్. చంద్రయ్య. సత్యం. ఆశన్నప్పా జ్యోతి. లక్ష్మీ. మరియు విద్యార్థులు పాల్గొన్నారు
చిత్రం