ఆశిస్సుల అక్షరాంజలి;- యలమర్తి అనూరాధ- హైదరాబాద్ :924726౦206

 కన్నుల్లో వెన్నెల కాంతులు
నవ్వుల్లో ముత్యాల సిరులు 
చేతల్లో మురిపాల వెల్లువలు 
నడకల్లో మయూర విన్యాసాలు 
నాట్యంలో అప్సరసల చందాలు 
ముద్దుల్లో మువ్వన్నెల అందాలు 
ముచ్చట్లలో లెక్కలేనని అనుభూతులు 
అలకల్లో ఆకాశం అంచులు 
అల్లరిలో అంతు తెలియని ఆనందాలు 
హరివిల్లుని తలపించే ముఖారవిందాలు 
ఎదగాలి ఒదగాలి చాన్నాళ్లు 
వెలసిల్లాలి నిండుగా నూరేళ్లు
; - 

కామెంట్‌లు