మా విశ్వ విజయశాంతి;-- గుర్రాల లక్ష్మారెడ్డి కల్వకుర్తి.సెల్.9491387977.నాగర్ కర్నూల్ జిల్లా.
శాంతి శాంతి ఓం శాంతి
క్రాంతి క్రాంతి మా విక్రాంతి
మా విశ్వజనుల సంక్రాంతి
గైకొన్నావా నీవు విశ్రాంతి !

శాంతి శాంతి ప్రజల ప్రశాంతి
పల్లెల ముల్లెల సజల స్రవంతి
జనజీవన వాదన మా వేదాంతి
చిన్నబోయే నీవు లేక విశ్వభవంతి !

ఎక్కడికెళ్లావు మా ముద్దులతల్లీ కనబడకుండా పోయావిక మళ్ళీ
మొదలాయెనుగా  లోగిలి లొల్లి
పాకి పోయానుగా అవి గల్లి గల్లి !

ఇక్కడ అక్కడ అనకుండా
ఎవరేమి చెప్పినా వినకుండా
ఇల సృష్టిస్తున్నారు గొడవలు
రాజకీయ అరాచక బడవలు !

ఆ గొడవల కుంపట్లో ఆజ్యం
పోస్తూ చేస్తున్నారు రాజ్యం
కుప్పకూలిపోయేగా వానిజ్యం
కష్టనష్టాల్లో చిక్కుకొనే సామ్రాజ్యం!

అఘాయిత్యాలు ఎన్నో విజృంభించే
అరాచకాల అంగడిని అవి ప్రారంభించే
ఇల న్యాయం ధర్మం ఇక అంతరించే
అన్యాయం ఆకాశమంత ఎదిగి అఘోరించే!

ఆ అఘాయిత్యాల అణిచివేయ నీవమ్మా
ఈ అరాచకాల రూపుమాప ఇక రావమ్మ
అమ్మ తల్లీ మా విజయశాంతి 
ఇల నెలకొల్పాలిక నీవే శాంతి  !


కామెంట్‌లు