ఇంద్రజాలకుని ప్రతిభ;- ఏ బి ఆనంద్,ఆకాశవాణి,విజయవాడ కేంద్రం,9492811322
 కాలం ఎవరి చేతుల్లోనూ లేదు  ఎవరు చెప్పినా వినదు తన పని తాను చేసుకుంటూ పోతుంది  టైం ఈస్ గాడ్ అని ఆంగ్ల సామెత  ఏ నిమిషాన చేయవలసిన పని ఆ నిమిషానికి చేయవలసినదే. వ్యక్తి కావచ్చు సమాజం కావచ్చు,  పక్షులు కావచ్చు ఏవైనా  సమయానికి ఆ పని చేయకపోతే ప్రాణానికి ముప్పు వస్తుంది అన్న సంగతి ప్రతి ఒక్కరికి తెలుసు. ఎర్లీ బర్డ్ గెట్స్ ఇట్స్ వర్మ్ ఎర్లీ  అని చెబుతారు  ఎవరు ముందు లేస్తే  వారికి ఆ పని సక్రమంగా అవుతుంది  పక్షుల ఆహారం కోసం అనేక ప్రాంతాలను తిరుగుతూ ఉంటాయి  ఏ పక్షి ముందు లేచి వెళితే ఆ పక్షికి అక్కడ ఆహారం దొరుకుతుంది  బద్ధకించి ఆలస్యంగా బయలుదేరి వెళ్లిన పక్షికి  అంత సులభంగా ఆహారం దొరకదు  చాలా కష్టపడాలి.
ఇది మానవాళికి కూడా వర్తించే సూత్రం  ఎవరు ముందుగా లేచి తన కార్యక్రమాలను పూర్తి చేసుకుంటారో వారు ఆ రోజు మొత్తం ప్రశాంతంగా  హాయిగా కాలక్షేపం చేస్తూ రాత్రి సుఖమైననిద్రను పొందుతారు  సామాన్యంగా ఎక్కువ మంది ఉద్యోగస్తులు గాని మిగిలిన వారు కానీ బద్ధకంతో కానీ  సూర్యుడు నడి నెత్తికి వచ్చేంతవరకు కూడా  మంచం మీద నుంచి లేవడానికి బద్దకించేవారు ఉన్నారు  వారి కార్యక్రమాలు ఎప్పుడు జరుగుతాయి  సమయానికి ఏ పని చేయకపోయినా  అది శరీరానికి హాని చేస్తుంది అన్నది  శాస్త్రజ్ఞులు చెబుతున్న విషయం  ఉదయం లేవగానే చేయవలసిన అల్పాహారాన్ని  మధ్యాహ్నం  తింటే తిరిగి ఎప్పుడు భోజనం చేయగలవు  తిన్నా అది అసంతృప్తిగానే ఉంటుంది కదా 
ఇక ఇంద్రజాలకుడు తన  ప్రజ్ఞను ప్రదర్శించడం కోసం  రకరకాల విన్యాసాలను చేస్తూ ఉంటాడు  ఎన్ని మాయలు చేస్తాడో చెప్పలేం  అతను చేసే ప్రతి అంశము కూడా  ప్రేక్షకులకు ఎంతో ఆకర్షణగా ఉంటుంది  కానీ వ్యక్తిగతంగా ఆ ఇంద్రజాలికుడు ఈ మాయలోపడడు  పడితే తన పని కాదు  ఆధ్యాత్మిక జ్ఞాన సంపదలో మునిగితేలిన  యోగి పుంగవులు  శరీరము యొక్క సహజ గుణాలను  వాటి వల్ల  కలిగే వ్యామోహాలను  తెలుసుకొని  ఆ వ్యామోహాలలో చిక్కుకోకుండా  దానిని ఆధారం చేసుకుని  తాను జీవితంలో ఏ మోక్ష సాధన కోసం ప్రయత్నం చేస్తున్నాడో తన దృష్టి అంతా దాని మీదే కేంద్రీకరించి  ఉంచడంతో విజయాన్ని సాధించగలుగుతున్నాడు అని చెప్తున్నాడు వేమన  వారు రాసిన ఆటవెలది పద్యాన్ని చదవండి.
"దేహ గుణములెల్ల దెలచిన శివయోగి మోహమందు జిక్కి మోసపోడు ఇంద్ర జాలకుండు ఎందుకు జిక్కురా..."  


కామెంట్‌లు