మురికిని దూరం చెయ్యాలి;- ఏ బి ఆనంద్,ఆకాశవాణి,విజయవాడ కేంద్రం9492811322
 ఇంటిని గురించి వేమన అనేక రకాల  ఉదాహరణలతో చాలా పద్యాలు చెప్పారు ఈ కొంప అంటే శరీరం  మురికితో కూడుకొని ఉన్నది  దానిలో జీవుడు  కర్మపాశాల్లో బంధించబడి ఉంటాడు  పాశము అనేది  వరము  శాపము ఎవరికి తెలియదు  వరం అనే అతను భావించి  ఈ శరీరం ద్వారా జీవితంలో పొందవలసిన ప్రతి సుఖాన్ని అనుభవించాలని తన మనసు కోరుకుంటూ ఉంటుంది  దానికి దాసోహం అనక తప్పదు  సామాన్యంగా ఇలాంటి కోరికలు మామూలు వారికి వస్తూ ఉంటాయి అనేది ఆలోచించండి  సహజ సిద్ధంగా ప్రతి వ్యక్తిలోనూ అంతర్లీనంగా  కామం ఉండి తీరుతుంది  కామం అంటే కోరిక లేని వాడు ఈ ప్రపంచంలో ఎవరు ఉండరు. అది మంచి కోరిక కావచ్చు చెడ్డ కోరిక కావచ్చు  దానిని తీర్చుకోవాలి అన్న కోరిక మానవునికి ఉంటుంది
ఇంటిని తీర్చిదిద్దాడని చూసేవాడికి ఆకర్షణగా ఉండాలని ఎన్నో అలంకరణలు చేస్తూ ఉంటాడు  తన దగ్గర ఉన్నఆర్థిక స్తోమతను బట్టి  అలంకరణ చాలా అందంగా చేయాలనుకుతూ ముందుకు వెళ్తారు  మామూలుగా చేసే అలంకరణలకు మిగిలిన ఏ గృహస్తు చేయకుండా మిగిలిన  పద్ధతులను తన సొంతం చేసుకుని  దానికి తగినట్టుగా  వ్యవహరిస్తాడు  తన గృహాన్ని చేసుకున్నట్లే మరో గృహమైన తన శరీరానికి కూడా  అలంకరణలు చేసి  నలుగురికి ఆకర్షణీయంగా ఉండేలా  నలుగురులో కూర్చున్న తానే కనిపించే పద్ధతిలో అన్ని ఏర్పాట్లు చేసుకుంటాడు  కొత్తగా వచ్చిన వస్త్రాలను ధరించి  తన గొప్పతనాన్ని చాటడం కోసమానట్లుగా  ఎన్నో ఆభరణాలతో సభలకు సమావేశాలకు కూడా వస్తూ ఉంటాడు. అదే తనకన్నా అందమైన ఆభరణాలు ధరించిన పడతి కనిపించినప్పుడు  ఆమెను మించిన ఆకర్షణ  తనకు కూడా ఉండాలన్న  ఆలోచనలతో మరికొన్ని ఆభరణాలను ధరించడం  చివరకు అది  గంగిరెద్దులాగా తయారవడం చూడడానికి ఎంతో ఇబ్బందిగా ఉంటుంది అన్న విషయం వారికి తెలియదు  ఇలాంటి పైపై అలంకరణలకు  అలవాటు పడి  తన మనసును వాటిపైనే లగ్నం చేసిన వాడికి  మోక్షాన్ని సంపాదించాలన్న కోరిక రావడం అతని జన్మలో జరగదు అసలు భగవంతుడు ఉన్నాడు అతనికి ధ్యానించడం వల్ల ముక్తి వస్తుంది అన్న ఆలోచన కూడా అతని మెదడుకు రాదు  అలాంటి వారిని చూసి జాలి పడాలి తప్ప వారి గురించి ఎక్కువగా ఆలోచించవలసిన అవసరం లేదంటాడు వేమన  దానిని దృష్టిలో పెట్టుకొని రాసిన ఆటో రెడ్డి పద్యాన్ని చూడండి.
"మురికి కొంపలోన నిరికించి జీవుని కర్మపాశమునకు గట్టివేసే  నిట్టి కర్మజీవికెట్లోకో మోక్షంబు..."


కామెంట్‌లు
Popular posts
తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు--ఎం బిందుమాధవి
చిత్రం
వినదగు నెవ్వరు చెప్పిన: --ఎం బిందుమాధవి
చిత్రం
కులవృత్తులు మరువకురా గువ్వలచెన్న వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండల్ గొటిక ఖుర్డు ప్రాథమిక పాఠశాలలో కుల వృత్తుల పై విద్యార్థులు వినూత్న ప్రదర్శన విద్యార్థుల వినూత్న ప్రదర్శన అభినందించిన బషీరాబాద్ వైస్ ఎంపీపీ జడల అన్నపూర్ణ వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండలం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల గోటిక ఖుర్దు స్కూల్లో గ్రామంలో ని కుల వృత్తులు పై విద్యార్థులు పాఠశాలల్లో వినూత్న ప్రదర్శన నిర్వహించారు నేటి సమాజంలో ప్రపంచీకరణ , ఆధునికత పేరుతో కులవృత్తులకు ఆదరణ కరువు అయినవీ పల్లె నుండి పట్నంకు బతుకుదెరువు కోసం కన్నతల్లిని ఉన్న ఊరిని వదిలి కుల వృత్తిని వదిలి పట్నంలో వెళ్లి కూలీ గా పనిచేస్తున్నారు కావున ఆనాటి నుండి నేటి వరకు గ్రామంలో అనేక కుల వృత్తుల ప్రాధాన్యత ఉంది సమాజంలో కుమ్మరి కమ్మరి మేతరి చాకలి . వడ్రంగి. రైతులు .పోస్ట్ మాన్ కురువ. లాయర్. డాక్టరు మొదలైన వృత్తుల ప్రతిబింబించే విధంగా కళ్లకు కట్టిన విధంగా పాఠశాల ఆవరణంలో విద్యార్థులు చక్కగా ప్రదర్శించారు పాఠశాల ప్రధానోపాధ్యాయులు మురళి హరినాథ్ విద్యార్థుల చేత 26 వేషధారణ వేసి విద్యార్థుల నైపుణ్యాన్ని వెలికి తీయడం కోసం మరుగునపడిన కులవృత్తులను గుర్తు చేసుకోవడం కోసం చక్క గా ప్రదర్శించడం జరిగింది విద్యార్థులలో చిన్నప్పటినుండి అన్ని అంశాలపై అవగాహన కలిగినట్లయితే భవిష్యత్తులో వారికి నిత్య జీవితంలో ఎంతో ఉపయోగపడుతుంది ప్రభుత్వ పాఠశాలలు మరింత బలోపేతం చేయడం కోసం విద్యార్థులను సర్వతోముఖాభివృద్ధి చేయడం కోసం కృషి చేస్తున్నానని ప్రధానోపాధ్యాయుడు మురళి హరినాథ్ చెప్పారు విద్యార్థులకు ఒత్తిడి లేకుండా జాయ్ full learning నేర్పించాలని సంకల్పించడం జరిగిందని అన్నారు ఈ కార్యక్రమంలో లో గ్రామ పెద్దలు శ్రీనివాస్ రెడ్డి ఉపాధ్యాయులు జయ శ్రీ .నవనీత. విటల్ గౌడ్. చంద్రయ్య. సత్యం. ఆశన్నప్పా జ్యోతి. లక్ష్మీ. మరియు విద్యార్థులు పాల్గొన్నారు
చిత్రం
రామాయణం‌ నుండి108 ప్రశ్నలు –జవాబులు!:----సుజాత.పి.వి.ఎల్.
చిత్రం
పూర్వ విద్యార్థుల సమ్మేళనం అపురూపం::-యాడవరo చంద్రకాంత్ గౌడ్ తెలుగు పండిట్- సిద్దిపేట-9441762105
చిత్రం