రైతు!!?;- సునీతా ప్రతాప్ ఉపాధ్యాయిని పాలెం
సూర్యుడు
తన చుట్టూ తిరిగే
భూగోళాన్ని
మట్టిని చేశాడు!!!

ఆ మట్టిని
కుమ్మరి కుండను చేస్తే

రైతు
ఆ మట్టితో ప్రపంచానికి
అక్షయపాత్రను
సృష్టించాడు!!?

ఎవరి పాత్రను వారు
నిజాయితీగా నిర్వర్తించారు!!?

కానీ
మనిషి మాత్రం
తన పాత్రను మర్చిపోయాడు!!?

భూమిని దున్నేందుకు
రెండెద్దులు
రైతుకు సహాయపడ్డాయి!!!
కానీ

ఇప్పుడు
భూమిని దున్నడానికి
రెండెద్దుల్లా
రైతులనే ఉపయోగించుకుంటున్నాడు
మనిషి!!?

రైతు ఇంకా చావలేదు
భూమిని దున్నితే
రైతు సమాధులు కాదు
అక్షయపాత్రలు బయటపడతాయి!!!!


కామెంట్‌లు