నిప్పు-నీరు రహస్యం;- ఎస్ మౌనిక

  హలో! మై డియర్ ఫ్రెండ్స్!ఎలా ఉన్నారు? అంత కులాసాయే కదా! విష్ యు వెరీ హ్యాపీ డే! ఈరోజు ఇంకో కొత్త విషయంతో మీ ఫ్రెండ్ మీ ముందుకు వచ్చేసింది గా!🤝... మీరు రెడీ నే కదా? చూసేద్దామా మరి! తెలుసుకుందామైతే! నిప్పుపై నీరు పోస్తే ఆరిపోతుంది కదా! ఇది మనకు తెలిసిన సాధారణమైన విషయమే!కానీ ఇలా ఎందుకు జరుగుతుందని మీరు ఎప్పుడైనా ఆలోచించారా? ఈరోజు దాని కారణమే మనం తెలుసుకుందాం. నిప్పుపై నీరు పోస్తే ఆ నీరు ఆవిరిగా మారుతుంది. నీటిని ఉడకబెట్టడం కంటే నీటిని ఆవిరిగా మార్చడానికి అయ్యే వేడి ఖర్చు ఐదు రెట్లు ఎక్కువ. దీని కారణంగా నీరు ఆవిరిగా మారడానికి ఎక్కువ వేడిని గ్రహించాల్సి ఉంటుంది. నీరు ఉడుకుతున్నప్పుడు అది ద్రవస్థితిలోనే ఉంటుంది. అదే నీరు ఆవిరి స్థితిలో ఉన్నప్పుడు విస్తరిస్తుంది. నిప్పు మీద నీరు పోసిన వెంటనే అది ఆవిరిగా మారి, నిప్పు వెలగడానికి అవసరమయ్యే ఆక్సిజన్ రాకుండా నిప్పు చుట్టూ ఆవిరి పొగ అనేది కమ్ముకుంటుంది. అందువల్ల ఆక్సిజన్ నిప్పును చేరలేదు. నిప్పు అందుకే ఆరిపోతుంది. ఇలాంటి సాధారణమైన విషయాలు కూడా మనకు తెలియని ఎన్నో కిసుక్కులు ఉంటాయండి మరి! ఇలాంటి ఎన్నో విషయాలను తీసుకురావడానికి మీ నేస్తం మీతో ఉందిగా! త్వరలో కలుద్దామా మరి! బాయ్!
కామెంట్‌లు