శబ్ద సంస్కృతి! అచ్యుతుని రాజ్యశ్రీ
 నిర్వాణం అంటే ముక్తి మోక్షం శాంతం! వేదాంత పరంగా ఐతే స్వర్గప్రాప్తి కైవల్యం.బౌద్ధ దర్శనం ప్రకారం నిర్వాణం అంటే పరమపద ప్రాప్తి.సాధనతో జననమరణాలు నించి విముక్తి పొందవచ్చు.దీనికై ఎంతో సాధన అవసరం.
నైమిశారణ్యం నించి నీమ్సార్ వచ్చింది.యు.పి.లోసీతాపూర్ లో ఉంది.11పురాణాలు ఇక్కడే రాయబడినాయి శ్రీరాముడు ఇక్కడే అశ్వమేధ యాగం చేశాడు.నైమిషుడు అనే ఋషి12ఏళ్ళ యగ్నం చేశాడు.ఎంతోమంది తపస్సు చేసిన పవిత్ర భూమి!
పూజచేశాక దేవునికి నైవేద్యం పెడతాం.అర్పణ అనే అర్థం కూడా ఉంది.గుడిలో దేవునికి నైవేద్యం పెట్టేటప్పుడు తెరవేస్తారు.ప్రసాదంని ఎంతో రుచిగా శుచిగా భక్తి శ్రద్ధలతో చేయాలి.కొంచెంపెడతారు కాబట్టి చాలా రుచిగా ఉంటుంది.శివలింగానికి పెట్టే నైవేద్యం ని కొన్ని చోట్ల తినటం నిషిద్ధం.దైవంకి నైవేద్యం ని దక్షిణ భాగంలో పెడ్తారు.సంస్కృతంలో నివేద్యం అని కూడా అంటారు.🌹

కామెంట్‌లు