సుప్రభాత కవిత ; -బృంద
వెలుగు రవ్వలు రాలుస్తూ
వెండి పువ్వులు పూయిస్తూ
నింగి నుదుట వజ్రమై మెరుస్తూ
నీలి నింగిని విహరిస్తూ...రవి రాగా

అలల కదలిక సరిగమలుగా
నావ నడకలు గమకాలుగా
నీటిబాటను వెలుగు సాగగా
నింగి నీలం మెరిసి మురిసెగా!

మధూదయాన మల్లెల లాగా
ఉషోదయాన తూరుపులా
అరుణోదయాన  వర్ణాలలా
సూర్యోదయాన కమలంలా

ఎగసే మనసుకు దొరికే
ఎన్నడు దొరకని...ఎపుడూ
ఎరుగని సంతోషానికి
ఎల్లలున్నవా....? ఈ జగాన

కలల తీరం అందుకోవాలని
కమ్మని జీవన పోరాటం తీరున
కడలి కెరటాల ఆరాటానికి
మొదలుందా?  తుది ఉందా?

జీవితంలో వచ్చిన మరో సుందర
శుభోదయానికి

🌸🌸 సుప్రభాతం 🌸🌸


కామెంట్‌లు