అన్ని దానములో కెల్లా విద్యదానము గొప్పది
నలుగురికి పంచితే పెరిగేది
జ్ఞాన జ్యోతి వెలిగించేది విద్య
జ్యోతి ని వెలిగిస్తే చుట్టు కాంతులు చిందుతుంది
విద్య అనే దీపాన్ని వెలిగిస్తే
చుట్టూ ఉన్నవారందరు
జ్ఞానవంతులు అవుతారు.
అన్నదానము మిక్కిలి శ్రేష్టం
ఆకలి గొన్న వారికి కడుపు నింపి
ప్రాణం నిలబెడుతుంది
కనిపించని భగవంతునికి
ప్రసాదాలా పేరుతో గొప్పలకు,
పోటీలకు పోయి లక్షలు ఖర్చుపెట్టేవారు
నెయ్యిలో వేయించిన జీడిపప్పుల పరవాన్నము
దేవునికి నైవేద్యoగా పెట్టినా ,కనిపించి ఆకలితో ఉన్నవారికి
పట్టెడన్నము పెడితే ఆ భగవంతుడు కూడా సంతోషిస్తాడు.
దేవుని హుండీలో వేసే వేలు,, లక్షల కంటే , బంగారపు
ఆభరణాలకంటే గుడి ఎదురుగా
బిచ్చగాడికి పదిరూపాయలు
దానం చేస్తే ఆదేవుడే మనకు రక్షణగా ఉంటాడు.
ఆస్తులు సైతం అమ్మి దానాలు చేసేవారు
కొందరు అయితే పిల్లికి బిక్షం వేయనివారు మరికొందరు.
కర్ణుడిలా దానాలు చేసి దనకర్ణుడు
అనే పేరు తెచ్చుకోవాలిసిన అవసరం లేదు
మనకు ఉన్నదానిలో కొంచెమైనా
అన్నదానం, విద్యాధానం, లాంటివి చేస్తే
ఆజీవితమే ధన్యం కదా!
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి