విష్ణు శర్మగారు రాగానే రాజు గారి పిల్లలు అందరూ పుస్తకాలు పలకలు తీసుకొని సిద్ధం అవుతుండగా శర్మగారు మీరు అవేవీ తీయకండి నేను మీకు పాఠాలు చెప్పడానికి రాలేదు మీతో మాట్లాడడానికి వచ్చాను మనం ఒకరికొకరు సరదాగా మాట్లాడుకుంటూ కాలక్షేపం చేసుకుందాం అనేసరికి పిల్లల ఆనందానికి అవధులు లేవు అలాగే అన్నారు కాల్పనిక కథలను ఆధారం చేసుకుని రాజ్య పరిపాలన ఎలా ఉండాలో ఎవరు ఎలా ప్రవర్తించాలో ఎవరి మనస్తత్వం ఎలా ఉంటుందో అన్నీ కుక్కని నక్కని సింహాన్ని ఎలుకని ప్రతి జంతువు నీ కథానాయకునిగా ఎన్నుకొని జానపద కథ చెప్పినట్లుగా పిల్లలకు కథ చెప్పినప్పుడు జీవితంలో వారికి కొత్త పద్ధతిగా కనిపించింది ఎంతో శ్రద్ధగా విన్నారు వారు పెరిగి పెద్దవారైన తర్వాత రాజ్యాన్ని ఎంతో సుభిక్షంగా సంరక్షించుకుంటూ పరిపాలన చేయగలిగారు. అలాగే ప్రయాగ రామకృష్ణ వ్రాసిన భారతంలో చిన్న కథలు అన్న పుస్తకం మీలాంటి ప్రతి విద్యార్థిని ఆకర్షిస్తుంది వ్యాస మహర్షి శైలి అందులోనూ ప్రత్యేకించి సంస్కృతంలో ఉన్న శ్లోకాలు మనకు అర్థం కావు అన్న విషయం ఆయనకు తెలుసు దానిని ఆయన చదివి అర్థం చేసుకొని అవగాహన చేసుకుని తన సొంత బాణీలో మీలాంటి పిల్లలకు అర్థమయ్యే పద్ధతిలో చివర నీతిని కూడా వివరిస్తూ చెప్పిన పద్ధతి మిమ్మల్ని ఎంతో ఆకర్షిస్తుంది కథ చెప్పడం వేరు కథలు నడిపించే తీరు వేరు పెద్దవారికి ఎలా చెప్పాలో వేదం తెలిసిన వారికి ఎలా చెప్పాలో పామరులకు ఎలా చెప్పాలో రచయితకు తెలిసినప్పుడు వారి భాషలో వారికి అర్థం అయ్యేలా చెప్తాడు చదివించే గుణం ఆ పుస్తకంలో ఉంది అలాంటి పుస్తకాలను ఎంచుకుంటే మీరు వద్దనుకున్నా పేజీలు అలా జరిగిపోతూ ఉంటాయి.
రాజకుమారులకు విష్ణు శర్మ గారు చెప్పదలుచుకున్న విషయం రాజ్యపాలన గురించి వీరు పెరిగి పెద్దవారైన తర్వాత ఏ రాజ్యాన్ని ఎలా ఉపయోగించాలి ఏ రాజులతో ఎలా ప్రవర్తించాలి అన్న విషయాలలో బాతా ఖాని రూపంలో వారి చిన్న మనసులకు హత్తుకునేట్లుగా పెద్దవారికి కూడా చదవాలన్న అఖిలాషను కలిగించేలా ఆ కథను కొనసాగించారు మిత్ర లాభం అని ఒక భాగాన్ని ఇతర రాజ్యాలలో ఉన్న రాజులతో వీరు స్నేహం చేస్తే ఆ రాజ్యం ఎలా దేదీప్యమానంగా ప్రకాశవంతంగా ఉంటుందో ఇతర రాజులు ఎవరైనా వచ్చి యుద్ధానికి సిద్ధపడితే వీరిద్దరూ కలిసి వారిని ఎలా ఓడించాలో వారిద్దరి మధ్య సహకారం ఏ పద్ధతిలో ఉండాలో అన్ని విషయాలను వారికే అర్థమయ్యేలా భవిష్యత్ కార్యక్రమాన్ని దృష్టిలో పెట్టుకొని ఆ విషయాన్ని ఆయన పిల్లలకి చెప్పారు.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి