తనను తానుగా చూడడం
మొదలుపెట్టాక
అద్దంలో ఆమె అందం రెట్టింపయ్యింది....
మునుపటిలా ఇప్పుడు
లోపాలు వెతకడం
లేదు తనును తాను ప్రేమించడమే అందుకు కారణం అనుకుంటాను...
ఆ కళ్ళలో కోటి కాంతుల కిరణాలు...
గాలి కెరటాల తాకిడికి
ఉయాలలూగుతున్న కురులు...
ఆ నగుమోమంతా నవ్వుల
పూత...
ఆ చెక్కిళ్ళలో సిగ్గు సింగారాలు...
ఆమెకిప్పుడు అంతా కొత్తదనమే...
పచ్చదనాన్ని కౌగిలించుకున్న వసంతమై వయసిప్పుడు చిగురులు తొడుగుతోంది....
కనుబొమ్మల నడుమ తీరైన ఆ ఎర్రని ప్రతిబింబమే తెలుగుదనానికి ప్రతీక...
ఆ నడుము వంపులను తీగలా అల్లిన ఆమె చీర బంగారమైంది....
ఇప్పుడిక ఏ చింతా లేదు...
ఎందుకంటే తనను తాను
తక్కువగా చూడడం మానుకుంది కదా...
ఆమెలోని ఆశలకు సీతాకోకచిలుక రెక్కలంటుకున్నాయి....
హద్దులు లేని ఏకాంతాన
తనను తాను మరిచిన మైమరుపున
తనువంతా వెన్నెలను నింపుకుంది...
మనసు ఆకాశంలో నిన్నటి జ్ఞాపకాలను చెరిపేసి నేటి అక్షరాలను పదిలపరిచే పనిలో పడింది...
తనతో తనకే కొత్త పరిచయం మొదలయ్యాక
ఇప్పుడు ఆమె పెదవులతో కాదు
కళ్లతో మాట్లాడుతుంది...

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి