సహజంగా మనం ఏ ఇంట్లో చూసినా పెద్దవాళ్లు చిన్నపిల్లలు పనీపాటా లేకుండా చదువు సంద్యాలు లేక తిరుగుతూ ఉన్న పిల్లలను చూసి బాధపడడం ఉండ బట్టలేక తిట్టడం సర్వసాధారణం ఎందుకురా తాటి చెట్టు లాగా పెరిగావు ఒక్క పని చేతకాదు ఎవరికీ ఏ సహాయం చేయలేవు అనడం వింటాం. తాటి చెట్టు కాయలు కోసిముంజలు తింటాం అది బాగా ముదిరిన తర్వాత దానిని నిప్పుల మీద కాల్చి దానిరసంపీల్చుకుంటాం ఆ చెట్టు ఆకులు నీకు గూడును దాని మోడును నరికి పందిరి గుంజలుగా వాడతాం ఆ మధ్యలో ఉన్న గుజ్జును పనికిరాదని పెంటపోగు పై వేస్తాను అది యురి ఎరువుగా పనికొస్తుంది రైతుకు అది ఎంతో ఉపయోగం మరి ఈ కుర్రవాణ్ణి తిట్టేటప్పుడు ఇంత అర్థం వచ్చేట్లుగా మీరు అన్ని రకాలుగా ఉపయోగపడతాడు అన్న పద్ధతిలో తిట్టారా ఆ పద్ధతిలో మాట్లాడారంటే వారికి ఈ విషయం తెలియనే తెలియదు. ఏ చెట్టుని మనం ప్రత్యేక శ్రద్ధ తీసుకొని పెంచడం కుదరదు విత్తు వేస్తే అది పెరిగి పెద్దదవుతుంది చిన్న పిల్లలు ఆడుకోవడానికి ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది దాని లేత కాయలు గృహిణి కూరగా ఉపయోగిస్తుంది పచ్చడిగా ఉపయోగిస్తుంది తర్వాత దానిని సంవత్సరాల తరబడి పనికి వచ్చే పచ్చడిగా ఉపయోగపడుతుంది ఆరోగ్య విషయంలో అది అమృతంలా పనిచేస్తుంది పత్యం చేయడానికి అది తగిన మందు పండిన కాయలను అలాగే మనం తినేస్తాం ఏవైనా కొమ్మలు విరిగి ఎండిపోతే అది వంట చెడుకుగా పనికొస్తుంది అన్నిటికీ మించి అది మనకు ఇచ్చే ప్రాణవాయువు ఇంతా అంతా కాదు అది కొనాలంటే లక్షలు ఖర్చు చేయవలసి ఉంటుంది చింత చిగురు పప్పు లో వేస్తే దాని రుచి మీరే చెప్పనవసరం లేదు చింత చెట్టు అన్ని విధాలుగా మనకు ఉపకరిస్తుంది. మన ఆయుర్వేద వైద్యులు చాలా మంది ఇంటిముందు వేపచెట్టు పెంచండి దానికి కారణం అది మనకు ఇచ్చే ప్రాణవాయువు మన జీవితాలను కాపాడుతుంది దాని గాలి మనకు హాని చేసే క్రిమి కీటకాలను నాశనం చేస్తుంది దాని ఆకు లేతగా ఉన్నప్పుడు ఒక రకమైన వైద్యానికి ముదిరిన తరువాత మరొక రకమైన వైద్యానికి పనికొస్తుంది వేప బెరడుతో అనేక ఔషధాలు తయారు చేస్తున్నారు ఈ చెట్టు ఎండిపోయిన తర్వాత దాని మొదలు కోసి చెక్కలుగా ఉపయోగించి ఇంటి నిర్మాణంలో వాడుకుంటారు దీని చిన్న కొమ్మ దంత ధావనానికి ఉపయోగించే వారు మన పెద్దలు అది ఉపయోగించిన ఎవరు వైద్యుని దగ్గరికి వెళ్లిన వారు లేరు ఇన్ని ఉపయోగాలున్న చెట్లతో పిల్లల్ని పోల్చడం మంచిదే కానీ చెడు కాదు కదా మీరు ఆలోచించండి.
చెట్టు;- డా.నీలం స్వాతి,చిన్న చెరుకూరు గ్రామం,నెల్లూరు.6302811961
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి