స్వరానందం;- డా.నీలం స్వాతి,చిన్న చెరుకూరు గ్రామం,నెల్లూరు.6302811961.

 మానవజాతి భూమి మీద 

అవిర్భావించిన సమయంలో  ఆకలి తీర్చుకోవడం తప్ప  మరొక విషయం తెలియని  తత్వం ఆనాటిది. సమాజం పెరుగుతున్న కొలది ఒక్కొక్క విషయం నేర్చుకుంటూ  వ్యాస మహర్షి వ్రాసిన మహాభారత సమయంలో సంగీతానికి ప్రాధాన్యం  వచ్చినట్లుగా చరిత్ర తెలియజేస్తోంది  లవకుశల గానం నుంచి  నారదుని మహతి నుంచి  స్వరాలలో అక్షరాలను  తెలుసుకోవడం గొప్పవిద్య  మొదట గాత్రానికి  జానపదులు పాడే పాటలతో ప్రారంభమైనది  రకరకాల పోకడలతో నేడు మనం  చెవికి ఇంపుగా వింటున్న కర్ణాటక సంగీతాన్ని ఉత్తరాది వారి హిందూస్థానీ సంగీతాన్ని వింటున్నారు అంటే  ఒక్క రోజులో ఊడిపడ్డ  విద్య కాదు అనేక రకాలుగా విసృతి చెందింది. అసలు సంగీతం దేనికి అంటే  మానసిక ఉల్లాసము కలిగించేది కనుక  కాలక్రమంలో వివిధ రకాల వ్యక్తుల అభిరుచులకు అనుగుణంగా అనేక రకాల ప్రక్రియలు మన ముందుకు వచ్చాయి  జానపద సంగీతం ఆటవిక సంగీతం  దేశి లేదా లౌకిక సంగీతం  వేదాంగాల్లో ఒక శిక్షా శాస్త్రం దాన్ని రచించినది నారద మహాముని  ఆయన సప్త స్వరాలు ఉన్నాయన్న విషయాన్ని మనకు తెలియజేశారు  దానిలో తిరిగి మూడు స్థాయిలలో ఉంటాయని అది మంద్ర స్థాయి, ఉచ్ఛ స్థాయి తారస్థాయి అని మనం పాడేటప్పుడు నిదానంగా చెప్పేవి కొన్ని ఉంటాయి మృదుత్వం ఉట్టి పడేలా  మధ్యగా చెప్పే పద్ధతి రెండవది  ఎంతో దూరంగా ఉన్న వారికి కూడా ఆనందాన్ని కలిగించడం కోసం  గట్టిగా పాడే సంగీతం  దీనిలో రకరకాల ప్రక్రియలు నిక్షిప్తమై ఉన్నాయి. వేదాల్లో చెప్పని ప్రక్రియ లేదు అని ప్రతి ఒక్కరు చెప్పే విషయం  ఈ సంగీతానికి సంబంధించిన విషయాన్ని కూడా  యజుర్వేదంలో కొన్ని సూచనప్రాయంగా ముచ్చడించడం  ఉన్నది అని వేదం చదివిన వారు చెప్పే విషయం  ప్రత్యేకించి సామవేదం సంగీతంతో కూడింది  దానిలో స్వరాలు తప్ప భాష అక్షరాలు లేవు  స్వరయుక్తంగా చెప్పే ప్రతి  దానికి అర్థం చేసుకునే స్థితి  శ్రోతకు ఉండాలి  ఇది గంధర్వులకు ఇష్టమైన సంగీతం కనక గాంధర్వ విద్య అని కూడా దీనికి పేరు ఉంది  తరువాత భరతుడు దానిని విస్తృతపరచి  ప్రపంచానికి అందించాడు అని పెద్దలు చెబుతారు  ఉత్తరకు బృహన్నల  నృత్యంతో పాటు సంగీతాన్ని కూడా తెలియజేసిన విషయం మనకు తెలుసు  శ్రీకృష్ణుడి లీలలన్నీ  సంగీత ప్రధానమైనవే అన్న విషయాన్ని గమనించాలి  అలా సంగీతం ప్రతి ఒక్కరిని ఆనందపరుస్తుంది అనడంలో ఆశ్చర్యం లేదు.




కామెంట్‌లు