ఇక్కడ కుటుంబ వ్యవస్థ ఎలా ప్రారంభమైంది అన్న విషయాన్ని గురించి ఆలోచిస్తే వ్యష్టిగా తాను మరో వ్యష్టి స్త్రీని ఎన్నిక చేసి సంసారం చేయడం ప్రారంభిస్తారు వారికి ఒక బిడ్డ జన్మించిన తర్వాత ఎంతో ఆనందిస్తారు శాస్త్ర ప్రకారం భార్యను భార్యగా చూడడం మొదటి కుమారుడు పుట్టే అంతవరకే ఆ తర్వాత తల్లిలా చూడమని శాస్త్రం చెప్తుంది పుత్రుడు అన్న దానికి అర్థం పున్నామ నరకం నుంచి కాపాడే వాడు అని మరి అందరూ ఆడ పిల్లలే పుడితే అతని పరిస్థితి ఏమిటి పున్నామ నరకం లోనే ఉండిపోతాడా అసలు ఈ నరకము స్వర్గము అన్న శబ్దాలను నమ్మే వారు ఎంతమంది ఉన్నారు ఇది నమ్మకమా మూఢ నమ్మకమా అని అనేక పర్యాయాలు వేమన మనలను ప్రశ్నిస్తూనే ఉన్నాడు సమాధానం ఎక్కడా లేదు కారణం అక్కడకు వెళ్లిన వాడు ఎవడూ తిరిగి మళ్ళీ ఈ భూమి మీదకు రాడు కనుక. పుత్రుడు జన్మించిన తర్వాత ఇద్దరు ముగ్గురు సంతానం కలిగిన తర్వాత వారికి పేర్లు పెట్టాలి వారిని పిలవాలన్నా వాడిని గుర్తించాలన్న ఏదో ఒక సంకేతం ఉండాలి కదా (గోరా) గోపరాజు రామచంద్ర రావు గారు అన్నట్లు వన్ టూ త్రీ ఫోర్ అనో ఒకటి రెండు మూడు నాలుగు అనో ఏక్ దో తీన్ చార్ అనో పేరు పెట్టవచ్చు కదా అనుకుంటే అసలు ఇబ్బందే లేదు కానీ మనకున్న నమ్మకం ఆ బిడ్డ ఎప్పుడు పుట్టింది ఏ నక్షత్రానికి సంబంధం దానికి తగిన అక్షరాలు ఏమున్నాయి అక్షరాలతో వచ్చే పేర్లు ఏది బాగుంటుంది దీనిని ఎంపిక చేసేది ఎవరు అని ఆలోచించుకుంటూ ఎవరో ఒక జాతకం చెప్పే వ్యక్తి దగ్గరకు వెళ్లి ఆ పేరు నిర్ణయించుకుని వస్తారు అలా నక్షత్రాన్ని చూసి పేర్లు పెట్టే పద్ధతిని కూడా విమర్శించే వారూ ఉన్నారు. అంత మాత్రం చేత సనాతన ధర్మాన్ని ఎవరు ఆపలేరు కదా రాముడు కృష్ణుడు అన్న భగవంతుని పేరు పెట్టుకుంటే ఎలా ఉంటుంది అని ఒక ఆలోచన వస్తుంది అలా కాదు మా చనిపోయిన తాతగారి పేరు పెట్టుకుంటే ఎలా ఉంటుంది అని తండ్రి అంటే అలా కాదు మా తాత పేరు పెట్టవచ్చు కదా అని భార్య అంటే ఏ పేరును నిర్ణయిస్తారు. ఇదంతా చీకాకులతో కూడిన వ్యవహారం దీనికి శాస్త్రీయమైన దృక్పథం ఏదైనా ఉన్నదా అంటే అసలు బిడ్డ పుట్టుకల గురించి అని అన్నప్పుడు ఆ పుట్టుకను నిర్ణయించేది ఎవరు స్త్రీ పురుష స్కలనంలో ఏర్పడ్డ బిడ్డ కణాన్ని గుర్తించగలిగినది తల్లి తండ్రి వారికి మాత్రం తెలుస్తుందా సమాధానము లేని ప్రశ్న శీర్షం భూమి మీదకు వచ్చిన క్షణాన్ని గుర్తు చేస్తారు దానివల్ల మంచి ఫలితాలు ఎలా వస్తాయి అన్నది మరో ప్రశ్న అందుకే ఈ రోజున అన్నీ మన పేర్లు కాకుండా ఆంగ్ల పేర్లు రావడం మొదలుపెట్టాయి అని నేను అనుకుంటున్నాను.
పుత్రోత్సహం;- డా.నీలం స్వాతి,చిన్న చెరుకూరు గ్రామం,నెల్లూరు.6302811961.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి