సనాతన ధర్మం;- డా.నీలం స్వాతి,చిన్న చెరుకూరు గ్రామం,నెల్లూరు.6302811961.
 ఏ వ్యక్తికైనా కావలసినది ధనం  తన చేతికి ధనం వస్తే తన కుటుంబం హాయిగా ప్రశాంతంగా  జీవించడానికి అవకాశం ఉంటుంది అన్న అభిప్రాయంతో  రకరకాల వ్యక్తులు రకరకాల పనులు చేస్తూ ధనాన్ని ఆర్జించడం కోసం  తమ జీవితకాలం కృషి చేయడం జరుగుతుంది ఈ సమాజంలో  కొందరు ఉద్యోగాల ద్వారా  వచ్చిన జీతాన్ని క్రమ పద్ధతిలో వినియోగించుకుని కొంత నిలువ చేసుకొని  మిగిలిన కార్యక్రమాలకు ఉపయోగించడం  ద్వారా సుఖాన్ని పొందుతారు మరి కొందరు వ్యాపారంలో  నిజాయితీగా వారు సంపాదించిన ధనంతో  తన కుటుంబ పోషణ తో పాటు  నిజమైన అవసరం కలిగిన వ్యక్తులను  ఆకలితో అల్లాడే వానికి  అన్నం పెట్టడం  లాంటి కార్యక్రమాలను చేస్తూ తమ జీవితాన్ని  సార్చకం చేసుకుంటారు. వివాహ వ్యవస్థలో  ప్రపంచ చరిత్రలో ఎక్కడా లేని విశేషం మన భారత దేశంలోనే ఉన్నది అన్నది స్పష్టం  సనాతన ధర్మం ప్రకారం ఒక స్త్రీని పురుషుని కూర్చోబెట్టి  వారి  నామం పేరుతో గోత్రం పేరుతో  ఎన్నో శుభాలను పలుకుతూ పురోహితుడు  సప్తపది తరువాత  ఎలా ఈ జీవితం గడపాలో తెలియజేస్తాడు అలా తెలియజేసినప్పుడు దానిని శ్లోకము ద్వారా చెబుతాడు  ఆ శ్లోకాలు వచ్చిన వారు ఎంతమంది ఉంటారు దాని అర్థం ఎంతమందికి తెలుస్తుంది  ధర్మేచ కామేచ అర్ధేచా మోక్షేచ నాతిచరామి  అన్న దాంట్లో నాతి అంటే స్త్రీతో గడుపు అన్న అర్థంలో మాట్లాడే  వ్యక్తులను కూడా మనం చూస్తూ ఉంటాం  దానివల్ల ఆయన ఏది చెప్పదలుచుకున్నాడో దాని అర్థం పూర్తిగా మారిపోయి  అతనిని ప్రక్కదారులు పట్టించే  స్థితికి వస్తుంది.అందుకే త్రిపురనేని రామస్వామి చౌదరి గారు  గోపరాజు రామచంద్ర రావు గారు (గోరా) ఆరుమళ్ల సుబ్బారెడ్డి గారు వేమన రెడ్డి గారి లాంటి పెద్దలు  తెలుగులో వారికి అర్థమయ్యే పద్ధతిలో జీవిత  సార్థకతను తెలియజేసి  చౌదరి గారు రాసిన  వివాహ విధి పుస్తకం నుంచి  చదివి వినిపించి ఆ పుస్తకాన్ని వారికి అందించి  మీరు ధనాన్ని సంపాదించకుంటే ధర్మ మార్గం కోసం పాటించండి కామాన్ని కానీ మోక్షాన్ని కానీ పొందాలి అన్నా ధర్మ మార్గం తప్ప మరొకటి లేదు  అని చెప్పి ఆ పద్ధతిలో జీవితాన్ని గడపమని సలహా ఇస్తూ  రెండు దండలను మార్చుకోవడంతో వివాహ విధిని పూర్తి చేస్తారు  మనుషులు మనసులు కలవడానికి మూడు ముడులు అవసరం లేదు  రెండు మనసులు చాలు అన్నది వారి సిద్ధాంతం.


కామెంట్‌లు