ఈ సృష్టిలో చీమ నుంచి సింహం వరకు ప్రతి జీవి ఎంతో సంతృప్తిగా జీవితాన్ని కొనసాగిస్తుంది రెక్కలు వచ్చినపక్షి కూడా తన అవసరాలను తానే తీర్చుకుంటుంది ఆకలి మంటలు చల్లార్చుకుంటుంది. తన పిల్లలకు కావలసిన అన్ని సౌకర్యాలను చేసి పెడుతుంది ఒక చీమను తీసుకున్నట్లయితే అంత చిన్న జంతువు కూడా తన పనిని తానే చేసుకుంటూ ఆహార సముపార్జనలో దాని వంతు అది కృషి చేస్తూ ఉంటుంది పెద్ద జంతువు సింహాన్ని తీసుకున్నట్లయితే దానికి ఆకలి అయితేనే వేటకు వెళుతుంది తన కడుపు నిండేంతవరకు తింటుంది తర్వాత హాయిగా విశ్రాంతి తీసుకుంటుంది అలాగే ప్రతి క్రిమి కీటకం కూడా ఎవరిపై ఆధారపడకుండా స్వయంకృషితో తన కుక్షిని తాను నింపుకుంటూ సుఖమైన జీవితాన్ని గడుపుతున్నాయి. మానవజాతి విషయానికొస్తే చంటి పిల్లవాడు కూడా తన స్వార్థంతోనే జీవితాన్ని ప్రారంభిస్తాడు తప్ప మరొక రకంగా ఆలోచించడు కన్నతల్లి పై తండ్రి చేయి వేసినా భరించలేనంత స్వార్థం ఆ బాల్యంలోనే ప్రారంభమవుతుంది పెరిగి పెద్దవాడై అందరి మనసు తత్వాలను అర్థం చేసుకొని జీవితంలో స్థిరపడానికి ముందుకు వచ్చిన ఒక వ్యక్తి చదువుకున్నవాడైతే ఉద్యోగం చేసుకుంటూ బ్రతుకుతాడు కొంచెం పెట్టుబడి పెట్టగలిగిన వారు వ్యాపారం చేస్తారు ఉన్నవారు పొలాన్ని దున్ని ఆరుగాలం శ్రమించి తను ఎప్పటికప్పుడు ఈ సంవత్సరం కన్నా ఎక్కువ పండించాలి అని ఆలోచిస్తాడు తప్ప ఇతరుల గురించి కానీ సమాజాన్ని గురించి కానీ ఆలోచన చేయడం చాలా తక్కువగా కనిపిస్తోంది. ఉద్యోగం చేసే వారికి మరికొంత వేతనం వస్తే బాగుంటుంది అనిపిస్తుంది వ్యాపారంలో తనకు మరింత లాభాలు రావాలని ప్రక్క మార్గాలుకూడా చూస్తాడు రైతు మరింత పండించి తన ఆదాయాన్ని పెంచుకోవాలని చూస్తాడు ఈ పెంచగా వచ్చిన ఆస్తి ధనం రూపంలో కానీ వస్తు రూపంలో కానీ తనకు తన కుటుంబానికి ఉపయోగించుకుంటాడు తప్ప ఇతరులు ఎంత అవసరంలో ఉన్నా వారి గురించి ఆలోచన చేయడు నిజానికి ఆ అవసరం కూడా అతనికి ఉండదు ఎంత సంపాదించినా చివరకు జరిగేది మిగిలేది ఏమిటి తన భౌతిక శరీరం ఈ భూమి మీద వదిలి వెళ్ళినప్పుడు తాను సంపాదించిన ధనాన్ని కానీ మరి ఏదైనా తన వెంట తీసుకువెళ్లడానికి అవకాశం ఉంటుందా జీవించి ఉండగానే మంచి పనులు చేయాలి అని మన పెద్దలు చెప్తూ ఉంటారు అలా చేస్తే భౌతికంగా మరణించినా శాశ్వతంగా అతని పేరు మిగిలి ఉంటుంది అని మర్చిపోతారు.
సత్కార్యాలు చేయండి;- డా.నీలం స్వాతి,చిన్న చెరుకూరు గ్రామం,నెల్లూరు.6302811961.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి