ఏడు చేపల కథ;- డా.నీలం స్వాతి,చిన్న చెరుకూరు గ్రామం,నెల్లూరు.6402811961
 చిన్నతనంలో మనం కథలు వింటాం  రాజు గారి ఏడుగురు కొడుకులు  వేటకు వెళ్లి చాపలు పట్టారు అని  ఆరోజున ఎంతో ఆనందించాం  కానీ ఆలోచించలేదు రాజు ఒక వ్యక్తి  అతనికున్న ఏడుగురు కొడుకులు సప్త ధాతువులుగా భావించాలి  ఆ రోజుల్లో  జీవించడానికి వేట ప్రధాన  ఆయుధం  వారు వేటకు వెళ్లారంటే జీవితాన్ని ప్రారంభించారు అని అర్థం. వేటనే జీవితం గా తీసుకోవాలి వీరు వేటాడింది ఏమిటి చెప్పండి అంటే మనిషిలో ఉన్నటువంటి ఆడిషెడ్ వర్గాలు ఆరు కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యాలు  మనిషిని చెడగొట్టే ఈ ఆరు గుణాలను ప్రయత్నం చేసి మనకు దూరంగా  ఉంచవచ్చు  ప్రయత్నం చేసి చూడాలి  సాధన చేస్తే చేయలేని పని మానవులకు ఉండదు.అలా ప్రయత్నం చేసి వాటిని స్వాధీనం చేసుకున్న మనిషికి ఏడవ చాప ఎండ లేదు అంటే దానికి కారణం  దానిని గురించి ఆలోచించవలసిన అవసరం ఉంది  మనిషిని నడిపేది మనసు  ఆ మనసు పరిపరి విధాలా పరిగెడుతూ ఉంటుంది దానిని అదుపు చేయడం ఎవరి వల్ల కాదు  ఏదో ఒక చేప ఈ మనస్సు  ఇది ఎండకు ఎండదు ఎంతో దీక్షతో కష్టపడి దానిని స్వాధీనం చేసుకోవాలి  అసలు మనసు అంటేనే సంకల్ప వికల్పాలతో కూడినది  వనరులు తక్కువ కోరికలు ఎక్కువ  కనుక అవి సాధించడం చాలా కష్టం  ఒకటి తీరితే మరొకటి మొలుస్తూ ఉంటుంది  ఆ మొలిచేదానిని  అంకురంలోనే చిదిపి వేయాలి  కోర్కెలను తీర్చుకొని ప్రతి వ్యక్తి మోక్షా నికి వెళ్లాలని కోరుకోవడం ప్రతి సామాన్యం  సహజం. ఈ చేప ఎండకపోవడానికి కారణం గడ్డిమేట అంటే మన మనసులో కుప్ప పోసిన అజ్ఞానం  దాన్ని తొలగించడం ఎలా  ఆ గడ్డిని  తగ్గించాలంటే ఆవును తీసుకురావాలి  అసలు ఆవు అంటే అర్థం జ్ఞానానికి ప్రతీక  అజ్ఞానం అనే ఆవు  మేస్తే అజ్ఞానం అనే గడ్డి కుప్ప కరిగిపోతుంది  ఆ గోవును తీసుకొచ్చేవాడు ఎవడు గొల్లవాడు  గొల్లవాడంటే సద్గురువు జగద్గురుడు  భగవద్గీతలో శ్రీకృష్ణ భగవాన్ గొల్లవాడు అని చెబుతారు  వాడు గోవులకు తేలేక పోవడానికి కారణం ఆకలి దానికి కారణం అమ్మ అన్నం పెట్టకపోవడం  దానికి కారణం పిల్లవాడి ఏడుపు ఏడుపు అంటే ఆర్తితో దైవానుగ్రహం కోసం చేసే అల్లరి   వాడిని చీమకుట్టింది కనుక వాడిని చూసిందమ్మా  సంసారంలో ఎన్నో అడ్డంకులు వస్తాయి ఆ అడ్డం కూడా నన్నిటిని  అధిగమించి ముందుకు వెళితే  పుట్టలోని చీమలన్నీ సరిపోతాయి  అని మీకు చెప్పడం కోసం చిన్నతనంలోనే ఈ కథను మనకు పెద్దవాళ్ళు చెప్పారు. అదీ విషయం.


కామెంట్‌లు