*పారిపోతున్నాను నేను*;- *'వాజ్ఞ్మయ రత్నాకర'**" రసస్రవంతి "* *'వాజ్ఞ్మయ భూషణ'* *" కావ్యసుధ "* *జంట కవి రచయితలు* 9247313488 ;హైదరాబాదు
అయ్యో నిరుపేద కంటినీరు
కారిపోతుంది
అది చూసి నా గుండె జారిపోతుంది

ఆకలి ఆకలంటు
కాళ్లు కొట్టుకుంటున్నాడు వాడు
కనబడిన వారి కెల్ల
చేతులెత్తి మొరపెట్టుకుంటున్నాడు
వాని మొర వినే దెవరు ?
వాన్ని పట్టించుకునే దెవరు?

పైకి అంతా దయామయులే
లోన మాత్రం స్వార్థపరులే !
వాన్ని ఆదుకునే దెవడు ?
వాన్ని చేదుకునే దెవడు ?

కరువు దేశంలో కనిపించడం లేదని
కాకుల్లా అరుస్తున్నారు నాయకులు
అజీర్ణ బాధతో ఆయస పడుతు
నిలబడలేక కూర్చున్న వినాయకులు.

ఎక్కడో ఘనవిజయం లభించిందని
ఎవడో నీళ్ళలా ఖర్చు పెడుతున్నాడు
బ్లాక్ మనీ 
చిల్లిగవ్వ దాన మిమ్మని
అడిగేవాణ్ణి కసురుతున్నా డేందుకని !?

ఆకలి......కాగలేక
వాడేదో దొంగతనం చేశాడని
అయ్యయ్యో చావ బాధతున్నారు చూడు
మొన్నటి నుండి మెతుకులు లేవని
మొత్తుకున్నా చిత్తుచేస్తున్నారు నేడు

అతుకుల అంగీ,  అడ్డ లుంగీ
అయ్యో వూడి వీడిపోతున్నవి
దెబ్బల కాగలేక
దబ్బున్న పారిపోలేక
దిమ్మరపోయి సొమ్మసిల్లాడు వాడు
వాన్ని రక్షించు వాడే లేడు.

అందుకే....
.
దొంగ నోట్లతో దోరాల్లా చలామనయ్యే
దొంగలు ఉన్న సంఘంలో
చరించలేక.... 
అంధుల్లా చరించే
గుండా గిరిని భరించలేక
పారిపోతున్నాను నేను !
మళ్లీ ఈ కుళ్ళు లోకానికి రానే రాను.

( ఆకాశవాణి హైదరాబాద్ సౌజన్యంతో  ఫిబ్రవరి,1973)

*'వాజ్ఞ్మయ రత్నాకర'**" రసస్రవంతి "* *'వాజ్ఞ్మయ భూషణ'* *" కావ్యసుధ "* *జంట కవి రచయితలు*  9247313488 ;హైదరాబాదు

కామెంట్‌లు