56.ఆ.వె.
భాష విలువ తెలియు భాషాభిమానికి
భాష నిలుప వలెను బాధ్యతెరిగి
భార మనక నేర్పు భాషవిలువలెన్నొ
సౌమ్య గుణము విడక సాగవలయు!!
57.ఆ.వె
నిదురనతిగ బోక నీవు భయమువీడి
బద్ధకమును వదిలి బాధ్యతెరిగి
ఉన్నతముగ నెదిగి నుండవలెనుసుమా
సౌమ్య గుణము విడక సాగవలయు!!
58.ఆ.వె.
పరిపరి విధములుగ పరి తపించు మనసు
మురిపెముల ముసుగులు మోసగించి
మాయచే మనసును మంట గలుపు నోయి
సౌమ్య గుణము విడక సాగవలయు!!
59.ఆ.వె.
తీక్ష్ణ కిరణ దాత తిమిరహరుడు రవి
కౌముదెల్ల చంద్ర కాంతి యగును
పోల్చి చూడ కుండ పుడమిలోమెలగరా
సౌమ్య గుణము విడక సాగవలయు!!
60.ఆ.వె.
శాంత మనసు గలిగి శరవేగముగబోయి
సత్య వాక్కు పలుకు సత్వరముగ
లోభ భావ మొదిలి లోక హితముగోరు
సౌమ్య గుణము విడక సాగవలయు!!
(ఇంకా ఉన్నాయి)
భాష విలువ తెలియు భాషాభిమానికి
భాష నిలుప వలెను బాధ్యతెరిగి
భార మనక నేర్పు భాషవిలువలెన్నొ
సౌమ్య గుణము విడక సాగవలయు!!
57.ఆ.వె
నిదురనతిగ బోక నీవు భయమువీడి
బద్ధకమును వదిలి బాధ్యతెరిగి
ఉన్నతముగ నెదిగి నుండవలెనుసుమా
సౌమ్య గుణము విడక సాగవలయు!!
58.ఆ.వె.
పరిపరి విధములుగ పరి తపించు మనసు
మురిపెముల ముసుగులు మోసగించి
మాయచే మనసును మంట గలుపు నోయి
సౌమ్య గుణము విడక సాగవలయు!!
59.ఆ.వె.
తీక్ష్ణ కిరణ దాత తిమిరహరుడు రవి
కౌముదెల్ల చంద్ర కాంతి యగును
పోల్చి చూడ కుండ పుడమిలోమెలగరా
సౌమ్య గుణము విడక సాగవలయు!!
60.ఆ.వె.
శాంత మనసు గలిగి శరవేగముగబోయి
సత్య వాక్కు పలుకు సత్వరముగ
లోభ భావ మొదిలి లోక హితముగోరు
సౌమ్య గుణము విడక సాగవలయు!!
(ఇంకా ఉన్నాయి)

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి