71.ఆ.వె.
అమ్మ మనసు వెన్న అమ్మలోపలనున్న
ఆదరాభిమాన మాట కన్న
ఆదరించు వారు అవని లోపల లేరు
సౌమ్య గుణము విడక సాగవలయు!!
72.ఆ.వె.
నిత్య సత్య విద్య నిర్విఘ్నముగ నేర్చి
వినయ శీల బుద్ధి వేద విహిత
యుతములన్ని శిష్య హితము గోరి చెపుము
సౌమ్య గుణము విడక సాగవలయు!!
73.ఆ.వె.
మీన మేషములను మీరు లెక్కించక
మంచి కార్యములకు మారు మాట
లాడకుండ మాన్యులార మెలగ రండి
సౌమ్య గుణము విడక సాగవలయు!!
74.ఆ.వె.
ముసలి వారి మనసు ముక్తి మార్గమెరిగి
పంతములనుమాని పదిలముగను
భక్తి భావ మందు యుక్తిగ నుండునా?
సౌమ్య గుణము విడక సాగవలయు !!
75.ఆ.వె.
పుట్టు గుడ్డి కూడ పూరి గుడిసె లోన
పట్టు బట్టి గట్టి పనులు జేయు
మనసు పెట్టి మంచి మనిషిగా నిలువుము
సౌమ్య గుణము విడక సాగవలయు !!
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి