76.ఆ.వె.
ధనము తోడ నహము దరిజేరుమనిషిలో
గుణము లేని తనము గోచరించు
గుణము కలిగి నీవు గుణవంతుడిగమారు
సౌమ్య గుణము విడక సాగవలయు !!
77.ఆ.వె.
ఎవరి నమ్మకంబు లెటులుండునోనట
వారి వారి మదికి వదిలివేసి
వాదులాట మాని వదులుకొనుట మేలు
సౌమ్య గుణము విడక సాగవలయు!!
78.ఆ.వె.
చెట్టు చెరువులందు చెల్లెలక్కలతోడ
తల్లిదండ్రులందు తనయులందు
భ్రాత గురువు లందు బాటసారులపట్ల
సౌమ్య గుణము విడక సాగవలయు!!
79.ఆ.వె.
ఒక్క పురుగు జేరి మొక్క నంత తొలిచె
నిమ్మ రసము జేరి కమ్మనైన
పాలు కాటు బోయె పాడు గుణము మాని
సౌమ్య గుణము విడక సాగవలయు!!
80.ఆ.వె.
వయసు మీరినపుడు వాదులాట తగదు
మనసెరిగి మెదులుట మాన్యమగును
కాదులేదుయనుట కవ్వింపుకేనట
సౌమ్య గుణము విడక సాగవలయు!!
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి